హోం మంత్రిత్వ శాఖ
జనవరి 24 శనివారం లక్నోలో ‘ఉత్తరప్రదేశ్ దినోత్సవం’..
ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
‘వన్ డిస్ట్రిక్ట్ వన్ క్విజీన్’ పథకాన్ని ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి
సర్దార్ పటేల్ పారిశ్రామిక ప్రాంత కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు
‘సీఎం యువా’లో అగ్రగామి ప్రదర్శనను కనబరిచిన జిల్లాలకు పురస్కారాలను అందించడంతో పాటు
ఉత్తరప్రదేశ్ గౌరవ్ సమ్మాన్ 2025-26ను కూడా ప్రదానం చేయనున్న హోం మంత్రి
प्रविष्टि तिथि:
22 JAN 2026 3:51PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జనవరి 24 శనివారం నిర్వహించే ‘ఉత్తరప్రదేశ్ దినోత్సవ’ సంబంధిత కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పాల్గొంటారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
లక్నోలోని రాష్ట్ర ప్రేరణ స్థల్‌లో నిర్వహించే ఒక కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ క్విజీన్’ (ఓడీఓసీ) పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకంలో భాగంగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి జిల్లాకు చెందిన ప్రత్యేక సాంప్రదాయిక వంటకాన్ని గుర్తించి, ఆ పదార్థ నాణ్యతను మెరుగుపరచడం, బ్రాండు స్థాయితో పాటు మార్కెట్టు లభ్యతను కూడా కల్పిస్తారు. దీనివల్ల స్థానిక రుచులు ఒక్క ప్రాంతీయ స్థాయిలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో కూడా గుర్తింపును పొందేందుకు అవకాశాలు లభిస్తాయి.
‘ఉత్తరప్రదేశ్ దినోత్సవం’ కార్యక్రమాలలో భాగంగా, సర్దార్ పటేల్ పారిశ్రామిక ప్రాంత సంబంధిత కార్యక్రమాన్ని కూడా కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ‘సీఎం యువా’ (ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ యోజన) పథకంలో శ్రేష్ఠమైన పనితీరును కనబరిచిన జిల్లాలకు శ్రీ అమిత్ షా పురస్కారాలను ప్రదానం చేస్తారు. దీంతో పాటు, ‘ఉత్తరప్రదేశ్ గౌరవ్ సమ్మాన్ 2025-26’ను కూడా ఆయన అందజేస్తారు.
***
(रिलीज़ आईडी: 2217312)
आगंतुक पटल : 2