హోం మంత్రిత్వ శాఖ
భరత మాత వీర పుత్రుడు రాస్ బిహారీ బోస్ వర్ధంతి.. ఆయనకు హృదయపూర్వక నివాళి అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
గదర్ విప్లవం మొదలు ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన వరకూ, దేశ స్వతంత్ర పోరాటానికి కొత్త దిశను చూపిన రాస్ బిహారీ బోస్
ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌ను ఏర్పాటు చేసి భారత స్వాతంత్య్ర ఉద్యమానికి విదేశాల్లో మద్దతునూ, వనరులనూ కూడగట్టి స్వేచ్ఛా సమరాన్ని ఆయన మరింత విస్తరించారు
प्रविष्टि तिथि:
21 JAN 2026 12:58PM by PIB Hyderabad
భరత మాత వీర పుత్రుడు రాస్ బిహారీ బోస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, గదర్ విప్లవం మొదలు ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించడం వరకూ, దేశ స్వాతంత్య్ర సమరానికి ఒక కొత్త దిశను రాస్ బిహారీ బోస్ చూపారని పేర్కొన్నారు. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’ను ఏర్పాటు చేయడం ద్వారా భారత స్వాతంత్య్ర ఉద్యమానికి విదేశాల్లో మద్దతుతో పాటు వనరులనూ ఆయన కూడగట్టి, స్వేచ్ఛా సమరాన్ని మరింత విస్తరించారని కూడా కేంద్ర మంత్రి అన్నారు.
***
(रिलीज़ आईडी: 2216791)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam