ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అస్సాంలోని కలియబోర్‌లో రూ. 6,950 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న కాజీరంగ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు


భూమి పూజకు సంబంధించిన విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 18 JAN 2026 5:04PM by PIB Hyderabad

అస్సాంలోని కలియాబోర్‌లో రూ. 6,950 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న కాజీరంగ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు భూమి పూజలో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు (జనవరి 18, 2026) ఆ ప్రాజెక్టు విశేషాలను సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో వరస పోస్టుల్లో పంచుకున్నారు.  

కజిరంగా ఎలివేటెడ్ కారిడార్‌కు పునాది రాయి వేయడం ఎంతో గర్వంగా,  గౌరవంగా భావిస్తున్నాఇది వన్యప్రాణులకు భద్రత కల్పిస్తుందిపర్యావరణ పరిరక్షణ కోసం మేం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.”

కలియబోర్ తో పాటు మొత్తం అస్సాం ప్రజల ఉత్సాహం -  డబుల్-ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవుతుందనే వారి నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.”

కాంగ్రెస్ ను ప్రతిచోటా తిరస్కరిస్తున్నారుమహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో జరిగిన ఎన్నికల్లో వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారువారికి అభివృద్ధికి సంబంధించిన ఎజెండా లేదుకాంగ్రెస్ పార్టీ కాజీరంగా లేదా అస్సాం సంక్షేమం కోసం ఎప్పుడూ పని చేయలేదు.”

కలియబోర్ నుంచి నుమాలిగడ్ వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుందివన్యజీవులను రక్షిస్తుందిపర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది.”

అస్సాంను రోడ్లురైల్వేలువాయుమార్గాలుజలమార్గాల ద్వారా అనుసంధానించడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తున్నాం.”

కాంగ్రెస్‌కు ఒకే ఒక్క విధానం  ఉంది చొరబాటుదారులను కాపాడటంఅధికారాన్ని స్వాహా చేయటంఅయితేఈ భయంకర మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ కు అస్సాం భూమి నుంచి కూడా గట్టి సమాధానమే వస్తుందని నా నమ్మకం.’’

 

***


(रिलीज़ आईडी: 2215911) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Gujarati , Tamil , Kannada