ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో స్టార్టప్ ఇండియా కార్యక్రమం దశాబ్ది ఉత్సవంలో తన ప్రసంగంలోని పలు విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
16 JAN 2026 7:14PM by PIB Hyderabad
నేడు జాతీయ అంకుర సంస్థల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం దశాబ్ది ఉత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దానికి సంబంధించిన ముఖ్యాంశాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఎక్స్ వేదికపై చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు..
‘‘నేడు మనం #10YearsOfStartupIndia ను జరుపుకుంటున్నాం
అంకుర సంస్థల ప్రపంచంలో గత పదేళ్లలో సాధించిన అనేక విజయాలు.. ఆవిష్కరణలను, వృద్ధిని ఈ వ్యవస్థ ఎలా ముందుకు తీసుకెళ్తోందో స్పష్టంగా చూపిస్తున్నాయి’’
చాలా కాలంగా పాతుకుపోయిన ఆలోచనా దృక్పథాలను మార్చడంలో #10YearsOfStartupIndia కీలక పాత్ర పోషించింది. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల యువత కూడా తమ కలలను అనుసరించి, వాటిని సాకారం చేసుకునేలా చేయగలిగింది’’
‘‘వివిధ రంగాలను సరికొత్త అవకాశాలతో అనుసంధానించే శక్తిమంతమైన వేదిక ‘‘స్టార్టప్ ఇండియా’’.
#10YearsOfStartupIndia’’
‘‘రాబోయే పదేళ్లలో కూడా అంకుర సంస్థల ప్రపంచంలో కొనసాగుతున్న ఈ వేగాన్ని మరింత బలోపేతం చేయడమే మన లక్ష్యం. తద్వారా అభివృద్ధి చెందుతున్న ధోరణులు, భవిష్యత్తు సాంకేతికతల్లో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించాలి.
#10YearsOfStartupIndia’’
(रिलीज़ आईडी: 2215493)
आगंतुक पटल : 5