ప్రధాన మంత్రి కార్యాలయం
‘స్టార్టప్ ఇండియా’కు పదేళ్లు నిండిన నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు
‘జాతీయ అంకుర దినోత్సవం’ సందర్భంగా యువతరం స్ఫూర్తిని ప్రశంసిస్తూ సంస్కృత సుభాషితాన్ని వారితో పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
16 JAN 2026 9:28AM by PIB Hyderabad
‘జాతీయ అంకుర దినోత్సవం’ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అంకురావరణంతో అనుసంధానితులైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రపంచ అంకురావరణ వ్యవస్థలో భారత్ పురోగమనానికి తోడ్పడిన ప్రజల... ముఖ్యంగా యువత సాహసం, ఆవిష్కరణ స్ఫూర్తి, వ్యవస్థాపనోత్తేజానికి ఈ రోజు ఒక ప్రతీక అని ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు.
అంకుర సంస్థ పరిణామశీల పాత్రను స్పష్టం చేస్తూ శ్రీ నరేంద్ర మోదీ:
“మన ఆర్థిక వ్యవస్థ, సామాజిక భవితను రూపుదిద్దే పరిణామాత్మక మార్పులకు అంకుర సంస్థలే చోదకశక్తి. భూగోళం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారంతోపాటు ప్రజలకు అవకాశాల సృష్టిలో వాటి కృషి అసాధారణం. సంప్రదాయ పరిస్థితులకు సవాలు విసురుతూ భారీ స్వప్నాలకు సాహసాన్ని జోడించి ముందడుగు వేసిన, అంకుర సంస్థల ద్వారా పరిణామశీల ప్రభావం చూపిన ప్రతి ఒక్కరినీ చూసి నేనెంతో గర్విస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.
అలాగే అంకురావరణ వ్యవస్థ బలోపేతానికి భాగస్వాములందరితో సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. రక్షణ, అంతరిక్షం సహా మునుపెన్నడూ ఊహించని రంగాల్లో అంకుర సంస్థల ప్రవేశానికి భారత సంస్కరణల ఎక్స్ ప్రెస్ సానుకూల వాతావరణం సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. అంకుర సంస్థలు నేడు స్వయంసమృద్ధ భారత్ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ముందడుగుకు వెనుదీయని, సమస్యల పరిష్కర్తలుగా మారాలని భావించే యువతకు మద్దతుపై ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
అంకుర సంస్థలకు మద్దతిచ్చే పెట్టుబడిదారులు, విద్యా సంస్థలు, సంపోషక సంస్థలు (ఇంక్యుబేటర్), మార్గదర్శకులు (మెంటార్లు) తదితరాలతో కూడిన విస్తృత వ్యవస్థ కృషిని కూడా శ్రీ మోదీ ప్రశంసించారు. యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించడంతోపాటు దేశ వృద్ధి పయనానికి ఈ వ్యవస్థ మార్గదర్శకత్వం, ఆలోచనలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన అన్నారు.
ఆవిష్కరణలు, పునరుత్థాన సామర్థ్యం, జాతీయ ప్రగతికి అంకుర సంస్థలు సారథ్యం వహిస్తున్నాయని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
దేశంలోని యువ వ్యవస్థాపకుల దృఢ సంకల్పం, అంకితభావాన్ని ప్రశంసిస్తూ ఒక సంస్కృత శ్లోకాన్ని శ్రీ మోదీ ఉటంకించారు. వారి నిర్విరామ కృషి అంకుర ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. వికసిత భారత్ స్వప్న సాకారంలో వారి శక్తిసామర్థ్యాలు, అభినివేశం అపరిమిత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని చెప్పారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక థ్రెడ్ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
“జాతీయ అంకుర దినోత్సవం సందర్భంగా ఈ వ్యవస్థతో ముడిపడిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు. ఈ రోజు మనకెంతో ప్రత్యేక... ఎందుకంటే- ‘స్టార్టప్ ఇండియా’కు నాంది పలికి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మనం ఈ వేడుక నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ అంకురావరణ వ్యవస్థలో భారత్ పురోగమనానికి తోడ్పడిన మన ప్రజల... ముఖ్యంగా ఇది మన యువతరం సాహసం, ఆవిష్కరణ స్ఫూర్తి, వ్యవస్థాపనోత్తేజాన్ని సగర్వంగా సంస్మరించుకునే రోజు.
#10YearsOfStartupIndia
“అంకుర సంస్థలు పరిణామశీలతకు చోదక శక్తులు... ఇవి మన ఆర్థిక వ్యవస్థతోపాటు సామాజిక భవితను తీర్చిదిద్దుతున్నాయి. భూగోళం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారంలో వాటి అసాధారణం. దీంతోపాటు ప్రజలకు అవి అపార అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయ పరిస్థితులకు సవాలు విసురుతూ భారీ స్వప్నాలకు సాహసాన్ని జోడించి ముందడుగు వేసిన, అంకుర సంస్థల ద్వారా పరిణామశీల ప్రభావం చూపిన ప్రతి ఒక్కరినీ చూసి నేనెంతో గర్విస్తున్నాను.
#10YearsOfStartupIndia”
“అంకురావరణ వ్యవస్థ బలోపేతానికి భాగస్వాములందరితో సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రక్షణ, అంతరిక్షం సహా మునుపెన్నడూ ఊహించని రంగాల్లో అంకుర సంస్థల ప్రవేశానికి భారత సంస్కరణల ప్రయాణం సానుకూల వాతావరణం సృష్టించింది. అంకుర సంస్థలు నేడు స్వయంసమృద్ధ భారత్ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుండటంపై నేనెంతో గర్విస్తున్నాను. సాహసంతో ముందుకొచ్చి, సమస్యల పరిష్కర్తలుగా ఎదగాలనే దృఢ సంకల్పంగల మన యువతకు మద్దతుపై మేం కట్టుబడి ఉన్నాం.
#10YearsOfStartupIndia”
“అంకుర సంస్థలకు మద్దతిచ్చే పెట్టుబడిదారులు, విద్యా సంస్థలు, సంపోషక సంస్థలు (ఇంక్యుబేటర్), మార్గదర్శకులు (మెంటార్లు) తదితరాలతో కూడిన విస్తృత వ్యవస్థ కృషిని కూడా గుర్తించాల్సిన దినమిది. యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించడంతోపాటు దేశ వృద్ధి పయనానికి ఈ వ్యవస్థ మార్గదర్శకత్వం, ఆలోచనలు ఎంతగానో తోడ్పడతాయి.
#10YearsOfStartupIndia”
“మన యువ మిత్రులు దృఢ సంకల్పం, అంకితభావంతో అంకుర ప్రపంచంలో నిత్యం ఎన్నో కొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. వారి ఉత్సాహం, అభినివేశం వికసిత భారత్ స్వప్న సాకారంలో అతిపెద్ద శక్తిగా ప్రధాన పాత్ర పోషిస్తాయి.
दुर्लभान्यपि कार्याणि सिद्ध्यन्ति प्रोद्यमेन हि।
शिलाऽपि तनुतां याति प्रपातेनार्णसो मुहुः॥”
అంటే- “అసాధ్యమనిపించేవి కూడా నిరంతర యత్నంతో సాధ్యమే..
పదేపదే ఎగసిపడే సముద్రపు అలలు శిలనైనా అరగదీస్తాయి” అని అర్థం.
***
(रिलीज़ आईडी: 2215215)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam