దేశవ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యాన్ని, అనుసంధానతను మెరుగుపరచడంలో కొత్త అమృత్ భారత్ రైళ్లు కీలక ముందడుగని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
వివిధ మార్గాల్లో తొమ్మిది కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్టుకు స్పందిస్తూ.... ఈ నిర్ణయం వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
ప్రయాణికుల అనుభవాన్ని, అనుసంధానతను మెరుగుపరచడంతో పాటుగా ఈ కొత్త అమృత్ భారత్ రైళ్లు వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహించడంలోనూ సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఆధునిక ప్యాసింజర్ రైళ్ల నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తూ... తొమ్మిది కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
ఈ కొత్త రైళ్ల సేవలు అస్సాంను హర్యానా, ఉత్తరప్రదేశ్‌లతో కలుపుతాయి. ఈ బహుళ మార్గాలు పశ్చిమ బెంగాల్‌ను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లతో కలుపుతాయి. దేశంలోని తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో అంతర్-రాష్ట్ర రైలు కనెక్టివిటీని ఇవి గణనీయంగా బలోపేతం చేస్తాయి.
‘ఎక్స్’ వేదికగా థ్రెడ్ పోస్టులకు స్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పోస్ట్ చేశారు...
కొత్త అమృత్ భారత్ రైళ్లు ప్రయాణికుల సౌకర్యం, కనెక్టివిటీని మెరుగుపరచడంలో కీలక ముందడుగు. వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం వంటి ఇతర ప్రయోజనాలూ వీటితో ఉన్నాయి!”