ప్రధాన మంత్రి కార్యాలయం
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని
प्रविष्टि तिथि:
12 JAN 2026 10:13AM by PIB Hyderabad
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళి అర్పించారు. అభివృద్ధి చెందిన భారత్ సాధించాలనే సంకల్పానికి అవసరమైన శక్తిని స్వామి వివేకానంద వ్యక్తిత్వం, రచనలు అందిస్తూనే ఉంటాయని శ్రీ మోదీ అన్నారు. ‘‘ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు నూతన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని జాతీయ యువజన దినోత్సవం అందిస్తుందని ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
"భారతీయ యువతకు స్ఫూర్తి అయిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఆయన వ్యక్తిత్వం, రచనలు వికసిత్ భారత్ సంకల్పానికి నిరంతరం కొత్త శక్తిని అందిస్తూనే ఉంటాయి. దేశ ప్రజలందరికీ ముఖ్యంగా యువతకు ఈ జాతీయ యువజన దినోత్సవం నూతన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందించాలని కోరుకుంటున్నాను."
(रिलीज़ आईडी: 2213621)
आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam