సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా డిజిటల్ క్రియేటర్ల సాధికారతకు డీడీ న్యూస్‌లో 'క్రియేటర్స్‌ కార్నర్'ను ప్రారంభించిన ప్రసార భారతి


ప్రసార భారతిలో కీలక సంస్కరణల సంవత్సరంగా 2026: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

ఆరెంజ్ ఎకానమీపై ప్రధాని మోదీ దార్శనికతను ప్రతిబింబించే క్రియేటర్స్ కార్నర్: డాక్టర్ ఎల్.మురుగన్

క్రియేటర్ ఎకానమీలో విప్లవాత్మక మార్పుగా వేవ్స్..

కోటి మంది యువతకు సాధికారతతో పాటు రూ.5,000 కోట్ల ఆర్థిక కార్యకలాపాల సృష్టి: అశ్వినీ వైష్ణవ్

प्रविष्टि तिथि: 09 JAN 2026 4:14PM by PIB Hyderabad

డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను గుర్తించిప్రోత్సహించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా "క్రియేటర్స్ కార్నర్పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రసార భారతి ఇవాళ ప్రారంభించిందిదేశవ్యాప్తంగా డిజిటల్ క్రియేటర్లు రూపొందించిన కంటెంట్‌ను డీడీ న్యూస్ వేదిక ద్వారా ప్రదర్శిస్తారు.

 

ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 ఏళ్లుగా భారతదేశంలోని అన్ని రంగాల్లో సంస్కరణలు జరుగుతున్నాయనిఈ నేపథ్యంలోనే ప్రసార భారతిలోనూ సంస్కరణలు చోటుచేసుకున్నాయని తెలిపారు.

 

ప్రసార భారతిలో కీలక సంస్కరణల సంవత్సరంగా 2026 నిలుస్తుందని.. సమాచారప్రసార మంత్రిత్వ శాఖలోనూ సమూల మార్పులు జరుగుతాయని కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారుఈ సంస్కరణల ద్వారా దూరదర్శన్ఏఐఆర్ వంటి సంస్థలను పరిశ్రమల భాగస్వామ్యంభవిష్యత్ తరం క్రియేటర్లుసాంకేతికత ఆధారిత ప్రక్రియల దిశగా మళ్లించనున్నట్లు చెప్పారుఈ సంస్కరణల ప్రయాణంలో క్రియేటర్ కార్నర్ తొలి అడుగని తెలిపారుగతేడాది ప్రారంభమైన వేవ్స్ గురించి ప్రస్తావిస్తూక్రియేటర్ ఏకానమీని బలోపేతం చేయటంలో ఇది కీలకపాత్ర పోషించిందనికోటి మంది యువతను భాగస్వాములను చేస్తూ కొత్త ఉపాధి అవకాశాలను కల్పించిందనిదాదాపు రూ.5,000 కోట్ల ఆదాయాన్ని ఈ వ్యవస్థకు చేకూర్చిందని వెల్లడించారు.

 

ప్రధానమంత్రి దార్శనికత ఆరెంజ్ ఎకానమీకి అనుగుణంగా దేశంలోని కంటెంట్ క్రియేటర్ల సాధికారత కోసం దూరదర్శన్ ద్వారా క్రియేటర్స్ కార్నర్ ప్రారంభించటం కీలక ముందడుగని డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారువిశాలమైన స్టూడియోల అవసరం లేకుండానే దేశంలోని పట్టణాలుమారుమూల గ్రామాలకు చెందిన క్రియేటర్లు స్వతంత్రంగా కంటెంట్‌ను రూపొందించిఎడిట్ చేసిషేర్ చేస్తూ జీవనోపాధిని కల్పించుకుంటున్న తీరును కొనియాడారుఅలాంటి ప్రతిభావంతులకు బలమైన జాతీయఅంతర్జాతీయ వేదికను ఇప్పుడు దూరదర్శన్ కల్పిస్తుందని.. ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన దూరదర్శన్ బృందాన్ని అభినందించారు.

 

ఈ కార్యక్రమం శక్తిమంతమైనబాధ్యతాయుతమైనసమగ్రమైన క్రియేటర్ వ్యవస్థను రూపొందించటంలో సహకరించనుందని ఎంఐబీ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు తెలిపారుక్రియేటర్లను కేవలం నటులుగా కాకపూర్తిస్థాయి కంటెంట్ రూపకర్తలుగా గుర్తించటమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారుడీడీ న్యూస్‌లో ప్రారంభమయ్యే 'క్రియేటర్స్ కార్నర్అన్ని దూరదర్శన్ ఛానెళ్లకూ విస్తరిస్తుందనివివిధ భాషలుప్రాంతాలువిభిన్న శైలికి చెందిన క్రియేటర్లకు జాతీయ స్థాయి వేదికను అందిస్తుందని తెలిపారుప్రత్యేక ప్రైమ్-టైమ్ స్లాట్ ద్వారా ప్రేక్షకులకు క్రియేటర్లు మరింతగా చేరువవుతారనివిభిన్న దృక్పథాలతో ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు ప్రేక్షకులను అలరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

క్రియేటర్స్ కార్నర్ గురించి

ప్రసార భారతివ్యక్తిగత కంటెంట్ క్రియేటర్ల మధ్య భాగస్వామ్యం ద్వారా నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించిదాని పరిధిని విస్తరించడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

వార్తలువర్తమాన అంశాలుసంస్కృతిప్రయాణంవంటకాలుకళలుసాహిత్యంసంగీతంనృత్యంఆరోగ్యంజీవనశైలివిద్యసైన్స్ అండ్ టెక్నాలజీస్ఫూర్తిదాయక కథలుపర్యావరణంసుస్థిరాభివృద్ధివినోదం వంటి ఎన్నో అంశాలపై కంటెంట్‌ను క్రియేటర్స్ కార్నర్ ప్రదర్శిస్తుంది.

ఈ కార్యక్రమం సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ రాత్రి 7:00 గంటలకు డీడీ న్యూస్‌లో ప్రసారమవుతుందిమరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు పునఃప్రసారం అవుతుందిప్రతి ఎపిసోడ్‌లో వివిధ అంశాలకు సంబంధించి నాలుగు నుంచి ఆరు రీల్స్ లేదా వీడియోలను ప్రదర్శిస్తారు.

 

ఈ కార్యక్రమం పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యానికి నిదర్శనంఇది డిజిటల్ క్రియేటర్లకు ప్రతిభను చాటుకోవటానికిప్రసార భారతిడీడీ న్యూస్ వంటి విశ్వసనీయ వేదికనువిస్తృతమైన ప్రజానీకాన్ని అందుబాటులోకి తెస్తుందియువతను ఆకట్టుకునే విధంగా వినూత్నవైవిధ్యభరిత కంటెంట్‌ను రూపొందించటానికి ప్రసార భారతికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ కార్యక్రమంపై ఆసక్తి ఉన్న క్రియేటర్లు తమ కంటెంట్‌ను ddnews.creatorscorner[at]gmail[dot]com కు మెయిల్ చేయవచ్చులేదా +91-8130555806 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు .

 

***


(रिलीज़ आईडी: 2213070) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam