ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

‘భారత్ క్లైమేట్ ఫోరమ్ 2026’లో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగం


వాతావరణ చర్య అనేది ఒక అవకాశమే కానీ, అడ్డంకి కాదు: ఉపరాష్ట్రపతి

నాగరికతా నైతిక విలువల్లో మమైకమైన భారత వాతావరణ చర్యలు: ఉపరాష్ట్రపతి

దేశ అభివృద్ధికి శక్తినివ్వడానికి స్వదేశీ స్వచ్ఛ సాంకేతికతల అవసరముందన్న ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 09 JAN 2026 3:07PM by PIB Hyderabad

నేడు న్యూఢిల్లీలో జరిగిన ‘‘భారత్ క్లైమేట్ ఫోరం 2026’’ ప్రారంభోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్  ప్రసంగించారు. వాతావరణ చర్యలు దేశ అభివృద్ధికి అడ్డంకి కాదనిఅవి సమగ్ర వృద్ధిని వేగవంతం చేయడానికిఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు ఒక వ్యూహాత్మక అవకాశమని ఆయన పేర్కొన్నారు.

లోతైన ఆలోచనలు, అర్థవంతమైన చర్యల కోసం ఈ ఫోరాన్ని ఒక జాతీయ వేదికగా తీర్చిదిద్దిన ‘అంతర్జాతీయ ఆర్థిక అవగాహన మండలి’ సంస్థను ఉపరాష్ట్రపతి అభినందించారు. వాతావరణం, సుస్థిరత్వం వంటి అంశాలపై దేశానికి ఉన్న అనుబంధం మన నాగరికత విలువల్లో లోతుగా నిక్షిప్తమై ఉందని ఆయన పేర్కొన్నారు. స్థిరత్వం సమకాలీన ఆందోళనగా ఉద్భవించడానికి చాలా కాలం ముందే మానవ కార్యకలాపాలు, ప్రకృతి మధ్య సమతుల్యత అవసరమని భారతీయ ఆలోచన ధోరణి తెలియజేసిందని ఆయన అన్నారు. ఇది మన సాంప్రదాయ జల సంరక్షణ పద్ధతులుసుస్థిర వ్యవసాయ విధానాలుజీవవైవిధ్య పరిరక్షణ, ప్రకృతిఅపరిగ్రహ వంటి నైతిక సూత్రాల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తుందని ఉపరాష్ట్రపతి వివరించారు.

గత దశాబ్ద కాలంలో దేశ అభివృద్ధి ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ.. వృద్ధి, సమానత్వం, ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు బాధ్యతల మధ్య భారత్ నిరంతరం సమతుల్యతను పాటిస్తూ ముందుకు సాగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న దేశం వాతావరణ బాధ్యతను ఎలా స్వీకరించాలనే విషయంలో ప్రాథమికంగా భారత్ సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

సీఓపీ-26 సదస్సులో భారత్ ప్రకటించిన పంచామృత ప్రతిజ్ఞలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. 2070 నాటికి నికర శూన్య ఉద్గారాలను సాధించడం, తక్కువ కార్బన్ ఉద్గారాల భవిష్యత్తు వైపు ఈ లక్ష్యాలు స్పష్టమైన మార్గాన్ని చూపుతాయని ఉపరాష్ట్రపతి అన్నారు అదే సమయంలో ఇవి దేశ అభివృద్ధి ప్రాధాన్యతలను, భవిష్యత్తు తరాల పట్లపై మనకున్న బాధ్యతను పునరుద్ఘాటిస్తాయని తెలిపారు.

స్వచ్ఛ సాంకేతికతల తయారీ ప్రాధాన్యతను ఉపరాష్ట్రపతి వివరించారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కేవలం దిగుమతి చేసుకున్న సాంకేతికతలు లేదా బలహీనమైన సరఫరా వ్యవస్థలపై ఆధారపడి నిర్మించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన స్వచ్ఛ సాంకేతికతలుదృఢమైన తయారీ వ్యవస్థ, భవిష్యత్తుకు అవసరమైన కార్మిక శక్తి పై ఆధారపడి ఉండాలని స్పష్టం చేశారు. పునరుత్పాదక శక్తి, ఇంధన నిల్వలుగ్రీన్ హైడ్రజన్ఎలక్ట్రిక్ వాహనాలు, స్థిరమైన పదార్థాలువాతావరణానికి అనుకూలమైన వ్యవసాయం, డిజిటల్ వాతావరణ పరిష్కారాలు వంటి రంగాల్లో భారత్ ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. ఇది మన మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియాగా మారుస్తోందని పేర్కొన్నారు.

భారతీయ కంపెనీలు సోలార్ మాడ్యూల్స్బ్యాటరీ తయారీఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలుఎలక్ట్రోలైజర్లు, గ్రీన్ ఫ్యూయల్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని ఉపరాష్ట్రపతి చెప్పారు. వాతావరణ డేటాఇంధన సామర్థ్యం, వ్యర్థాల నిర్వహణలో అంకుర సంస్థలు సరికొత్త ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ సహకారం గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. వాతావరణ మార్పు ఒక ఉమ్మడి సవాలని దీనిని ఎదుర్కొనేందుకు సమిష్టి చర్య అవసరమని అన్నారు. భాగస్వామ్యాల విషయంలో భారతదేశ విధానం ‘ఎవరిపైనా ఆధారపడకుండా పరస్పర సహకారం’ అందించుకోవడమేనని  తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి వెనుక ఒక స్థాపక శక్తిగాతక్కువ ఖర్చుతో కూడిన, భారీ స్థాయిలో అమలు చేయగల సౌర పరిష్కారాల కోసం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకం చేసిందని ఆయన అన్నారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాల బలోపేతానికి, అభివృద్ధి ఫలాలు దెబ్బతినకుండా కాపాడటంలో భారత్ చూపుతున్న నాయకత్వం.. భవిష్యత్తు దృష్టిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలోభారత్ క్లైమేట్ ఫోరం చైర్మన్, రాజ్యసభ మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీ ఎన్. కె. సింగ్, భారత్ క్లైమేట్ ఫోరం కన్వీనర్, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి, భారత్ క్లైమేట్ ఫోరం కో-చైర్ శ్రీ సుమంత్ సిన్హా, భారత్ క్లైమేట్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ అశ్వని మహాజన్ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలుపారిశ్రామిక వేత్తలు, నిపుణులువిద్యావేత్తలు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2212967) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Malayalam