ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ప్రవాస భారతీయులకు ప్రధాని శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 09 JAN 2026 11:58AM by PIB Hyderabad

ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ప్రవాస భారతీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

భారత దేశానికిప్రపంచానికి మధ్య శక్తిమంతమైన వారధిగా ప్రవాస భారతీయులు వ్యవహరిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు.

వారిని భారత్‌కు మరింత చేరువ చేసేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:

‘‘ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలుభారతదేశానికి ప్రపంచానికి మధ్య శక్తిమంతమైన వారధిగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు వ్యవహరిస్తున్నారువారు ఎక్కడికి వెళ్లినా అక్కడి సమాజాలను సుసంపన్నం చేస్తున్నారుఅదే సమయంలో వారి మూలాలకు అనుసంధానమై ఉంటున్నారుభారతీయ సంస్కృతికి అంతర్జాతీయ ప్రాముఖ్యాన్ని తీసుకొచ్చిన ప్రవాస భారతీయులే మన రాయబారులని నేను తరచూ చెబుతుంటానుభారతదేశానికి మరింత చేరువగా వారిని తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.’’

 

***


(रिलीज़ आईडी: 2212928) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam