WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

సృజనాత్మక నిపుణుల కోసం వేవ్స్‌ బజార్‌ ‘వార్షిక సామర్థ్య వికాస వెబినార్ కార్యక్రమం


దేశీయ సృజనకర్తలకు విజ్ఞాన వృద్ధి... ప్రపంచ మార్కెట్‌ సంసిద్ధత లక్ష్యంగా ఏడాది పొడవునా పరిశ్రమ వెబినార్లు

 प्रविष्टि तिथि: 08 JAN 2026 4:40PM |   Location: PIB Hyderabad

సమాచార-ప్రసార శాఖ పరిధిలో ప్రారంభమైన వేవ్స్‌ బజార్‌ విజయవంతమైన నేపథ్యంలో ఏడాది పొడవునా కార్యక్రమాల నిర్వహణ కూడలిగా పరిణామం చెందుతోంది. ఇందులో భాగంగా పరిశ్రమ నేతృత్వాన ప్రణాళికబద్ధంగా వెబినార్లు, మాస్టర్‌క్లాస్‌ల నిర్వహణకు శ్రీకారం చుడుతోంది. తద్వారా దేశంలోని చలనచిత్ర, సంగీత, యానిమేషన్, గేమింగ్ రంగాల్లో వృత్తిగత సామర్థ్య బలోపేతానికి అనువైన కార్యక్రమాన్ని సిద్ధం చేసింది.

నవ్య విజ్ఞాన వృద్ధి కార్యక్రమం

దేశంలోని సృజనకర్తలు, స్టూడియోలు, అంకుర సంస్థలతోపాటు ఇప్పటికే స్థిరపడిన పరిశ్రమ నిపుణులకూ ప్రత్యక్ష సౌలభ్యం కల్పనపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది... సదరు కీలక రంగాలివే:

·         ప్రాక్టికల్ కంటెంట్ క్రియేషన్‌: నిర్మాణం, సృజనాత్మక కార్యకలాపాలపై అవగాహన

·         మోనిటైజేషన్‌-ఐపీ: మేధా సంపత్తి, ఆదాయ సృష్టి వ్యూహాలు.

·         గ్లోబల్‌ రీచ్‌: అంతర్జాతీయ వ్యాప్తి లక్ష్యంగా మార్కెట్ సంసిద్ధత, డిజిటల్ వ్యవస్థలు.

ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్ష విధానంలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రశ్నోత్తర విభాగాలు ఉంటాయి. తద్వారా వాస్తవ ప్రపంచ విజ్ఞాన ఆదానప్రదానాల సౌలభ్యం దిశగా స్వతంత్ర వృత్తిదారులతో పారిశ్రామికవేత్తలు, నిపుణులు నేరుగా సంభాషణల్లో పాల్గొనగలుగుతారు.

ఈ ప్రక్రియను ఏడాది పొడవునా కొనసాగించే వేదికగా రూపొందించడం కోసం పరిశ్రమ నేతృత్వాన ప్రణాళికబద్ధ ‘వెబినార్లు, మాస్టర్‌క్లాస్‌’లను వేవ్స్‌ బజార్‌ సంవత్సరమంతా నిర్వహిస్తుంది. దేశీయ చలనచిత్ర, సంగీత, యానిమేషన్, గేమింగ్ రంగాలలో వృత్తిగత సామర్థ్య వికాసం దీని లక్ష్యం. అలాగే విజ్ఞాన వృద్ధి, ప్రపంచ మార్కెట్ సంసిద్ధత సహా ఇప్పటికే స్థిరపడిన పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్ష సంభాషణ ద్వారా ఆయా రంగాల నిర్దిష్ట అవగాహన సౌలభ్యం కల్పిస్తుంది.

సృజనాత్మక వ్యవస్థాపన, ప్రపంచ భాగస్వామ్యం, సృజనావరణ వ్యవస్థకు రూపకల్పనపై వేవ్స్‌ బజార్ విస్తృత కర్తవ్యంలో ఈ వెబినార్ కార్యక్రమం ఒక భాగంగా ఉంటుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తమతమ సెషన్లను విజయవంతంగా పూర్తి చేశాక వేవ్స్‌ బజార్ ద్వారా ‘పార్టిసిపేషన్ సర్టిఫికేట్‌’ ప్రదానం చేస్తారు.

వెబినార్‌ షెడ్యూల్‌

వేవ్స్‌ బజార్‌ ఈ నెలలో ప్రపంచ మార్కెట్ సౌలభ్యం, సృజనాత్మక రంగంలో మేధా సంపత్తిపై దృష్టి సారించే రెండు ధ్రువీకృత పరిశ్రమ-నేతృత్వ వెబినార్లను నిర్వహిస్తుంది.

ఇందులో భాగంగా ఈ నెల 15న “టేకింగ్ ఇండియా టు ది ఇంటర్నేషనల్ మార్కెట్” పేరిట ఒక చలనచిత్ర ప్రాధాన్య గోష్ఠికి అకాడమీ అవార్డు గ్రహీత నిర్మాత గునీత్ మోంగా నేతృత్వం వహిస్తారు.

అనంతరం ఈ నెల 22న ‘హూప్ర్’ - ఏఐ ఆధారిత సంగీత లైసెన్సింగ్ వేదిక వ్యవస్థాపకుడు గౌరవ్ దగాంకర్ నాయకత్వంలో ‘డిజిటల్ సంగీత ప్రపంచ మేధా సంపత్తి హక్కుల రక్షణ’పై సంగీత రంగ వెబినార్ నిర్వహిస్తారు.

అటుపైన ఫిబ్రవరిలో చలనచిత్ర, గేమింగ్, యానిమేషన్, వేదికల సౌలభ్యం తదితరాలపై ఆన్‌లైన్ సెషన్లను వేవ్స్‌ బజార్ వరుసగా నిర్వహిస్తుంది. స్క్రీన్‌ప్లే తయారీ, కథా గమనం, ప్రపంచ గేమ్ ప్రచురణకర్తల అంచనాలు, అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం భారత ఇతిహాస కేంద్రక చిత్రణం, యానిమేషన్‌ డిజైన్ నైపుణ్యం, వేవ్స్‌ బజార్ పోర్టల్, ప్రదర్శన గదుల పరిశీలన వంటివి కూడా కార్యక్రమంలో భాగంగా ఉంటాయి.

ఆ తర్వాత మార్చి నెలలో కీలకమైన మార్కెట్‌, వృద్ధి ఇతివృత్తాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. భారత గేమింగ్ వ్యవస్థ నగదీకరణ, స్తంభిత పెట్టుబడి వాతావరణంలో నిధుల లభ్యత సమస్యలు, యూట్యూబ్‌ వంటి వేదికలలో సంగీత రాయల్టీ, డిజిటల్ పంపిణీ, భారత్‌లో పీసీ గేమింగ్ పునరుజ్జీవనం తదితర అంశాలపై చర్చాగోష్ఠులుంటాయి.

ఇవన్నీ ఏడాది పొడవునా విజ్ఞాన వృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉంటాయి. ఈ మేరకు చలనచిత్ర, సంగీత, గేమింగ్, వర్ధమాన మీడియా రంగాల్లో మార్కెట్ సౌలభ్యం, నగదీకరణ, సాంకేతికత, ప్రపంచ భాగస్వామ్యం తదితరాలపై సమస్యల పరిష్కారం దిశగా మరిన్ని వెబినార్లను రూపొందించి నిర్వహిస్తారు.

నేషనల్ మీడియా సెంటర్‌లో కేంద్ర మంత్రులు శ్రీ అశ్వనీ వైష్ణవ్, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ 2025 జనవరి 27న వేవ్స్ బజార్‌ను ప్రారంభించగా, మీడియా-వినోద రంగానికి ఇదొక కీలక అంతర్జాతీయ మార్కెట్‌గా రూపొందింది.

ఆనాటి నుంచీ టెలివిజన్, గేమింగ్, ప్రకటనలు, ‘ఎక్స్‌ఆర్‌’ సహా అనుబంధ రంగాల భాగస్వాములకు ఈ వేదిక ఒక కూడలిగా రూపొందింది. ప్రారంభం నుంచి ఇప్పటిదాకా కింది అంశాల్లో గణనీయ ప్రగతి సాధించింది:

·         మొత్తం 5000 మందికి పైగా కొనుగోలుదారులు... దాదాపు అదే సంఖ్యలో విక్రేతలు

·         బహుళ వేదికల ద్వారా 1,900కు పైగా ఆచరణాత్మక ప్రాజెక్టులు.

 

***


रिलीज़ आईडी: 2212671   |   Visitor Counter: 7

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Kannada , Malayalam