ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సోమనాథ్ స్వాభిమాన పర్వ్ ప్రారంభం: దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


దేశ ప్రజలందరి సంక్షేమం కోసం ప్రార్థిస్తూ సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 08 JAN 2026 9:50AM by PIB Hyderabad

సోమనాథ్ స్వాభిమాన పర్వ్ ప్రారంభం సందర్భంగా నేడు దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వెయ్యేళ్లుగా లక్షలాది ప్రజల హృదయాల్లో సోమనాథ్‌ను సజీవంగా నిలిపిన కాలాతీత నాగరికతా స్ఫూర్తిని ఆయన గుర్తుచేసుకున్నారు.

సోమనాథ్ 1026 సంవత్సరం జనవరిలో మొదటి దాడిని ఎదుర్కొందని శ్రీ మోదీ చెప్పారు. తర్వాతి శతాబ్దాల్లోనూ పదేపదే దాడులు జరిగినప్పటికీ.. భక్తుల అచంచలమైన విశ్వాసం, భారతీయ నాగరికతా దృఢ సంకల్పం వల్ల ప్రతీసారి సోమనాథ క్షేత్రం పునర్నిర్మితమై నిలిచింది. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌ అంటే.. సిద్ధాంతాలు, విలువల విషయంలో ఎన్నడూ రాజీపడని అసంఖ్యాకులైన భరతమాత బిడ్డలను స్మరించుకోవడమే. పరిస్థితులు ఎంత భీకరంగా ఉన్నప్పటికీ.. వారి సంకల్పం చెక్కుచెదరలేదు. మన సంస్కృతి పట్ల వారి నిబద్ధత ఎంతమాత్రమూ సడలలేదు అని ఆయన అన్నారు.

గతంలో తన సోమనాథ్ పర్యటనలకు సంబంధించిన మధుర స్మృతులను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. #SomnathSwabhimanParv హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ ప్రజలంతా తమ జ్ఞాపకాలను పంచుకుంటూ, ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 1951లో పునర్నిర్మించిన సోమనాథ ఆలయ ద్వారాలు నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెరుచుకున్నాయి. ఆ చారిత్రక ఘట్టానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 2001 అక్టోబరు 31న నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్కె.ఎం. మున్షీ, తదితర ప్రముఖులు అత్యంత కీలక పాత్ర పోషించారని వ్యాఖ్యానించారు. 2001లో ఆ కార్యక్రమం, సర్దార్ పటేల్ 125వ జయంతి వేడుకలు ఒకేసారి జరగడం విశేషం. నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిహోం మంత్రి లాల్ కృష్ణ అద్వానీతోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

అలాగే 1951లో సోమనాథ ఆలయాన్ని దేశానికి పునరంకితం చేసిన మహత్తర ఘట్టానికి 2026తో 75 ఏళ్లు పూర్తవుతాయని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ చారిత్రక ఘట్టం ఆలయ పునర్నిర్మాణానికి మాత్రమే సంబంధించింది కాదు.. తరతరాలకు స్ఫూర్తినిస్తూ కొనసాగుతున్న మన నాగరికత అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనం” అని ఆయన స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“జై సోమనాథ్!

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నేడు ప్రారంభమవుతోంది. వెయ్యేళ్ల కిందట.. 1026 జనవరిలో సోమనాథ్ తొలి దాడిని ఎదుర్కొన్నది. 1026 దాడిగానీ, అనంతర దాడులుగానీ లక్షలాది మంది అచంచలమైన విశ్వాసాన్ని ఏమాత్రమూ సడలించలేకపోయాయి. నాగరికతా స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేకపోయాయి. ఆ స్ఫూర్తితోనే సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ పునర్నిర్మితమై నిలిచింది.

గతంలో నా సోమనాథ్ పర్యటనల నుంచి కొన్ని చిత్రాలను నేను మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా అక్కడికి వెళ్లి ఉంటే, #SomnathSwabhimanParv హాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి ఆ చిత్రాలను అందరితో పంచుకోండి.”

“#SomnathSwabhimanParv అంటే.. సిద్ధాంతాలు, విలువల విషయంలో ఏనాడూ రాజీపడని అసంఖ్యాకులైన భరతమాత బిడ్డలను స్మరించుకోవడమే. పరిస్థితులు ఎంత భీకరంగా ఉన్నప్పటికీ.. వారి సంకల్పం చెక్కుచెదరలేదు. మన సంస్కృతి పట్ల వారి నిబద్ధత ఎంతమాత్రమూ సడలలేదు.”

“2001 అక్టోబర్ 31న సోమనాథ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలివి. 1951లో పునర్నిర్మించిన సోమనాథ ఆలయ ద్వారాలు.. నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెరచుకున్న మహత్తర ఘట్టానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుక అది. సర్దార్ పటేల్, కె.ఎం. మున్షీ, తదితరుల కృషి అత్యంత ప్రశంసనీయం. అదే సమయంలో సర్దార్ పటేల్ 125వ జయంతి వేడుక కూడా జరిగింది. 2001 నాటి కార్యక్రమానికి నాటి ప్రధానమంత్రి అటల్ గారు, హోంమంత్రి అద్వానీ గారు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

1951 నాటి మహోజ్వల ఘట్టానికి 2026లో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి!”

 

“జై సోమనాథ్!

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నేడు శుభప్రదంగా ప్రారంభమవుతోంది. వెయ్యేళ్ల కిందట.. 1026 జనవరిలో సోమనాథ మందిరం చరిత్రలో తొలి దాడిని ఎదుర్కొన్నది. 1026 దాడిగానీ, అనేక అనంతర దాడులుగానీ.. అచంచలమైన మన విశ్వాసాన్ని సడలించలేకపోయాయి. పైగా ఈ ఘటనలు భారత సాంస్కృతిక ఏకతా భావనను మరింత బలోపేతం చేశాయి. మళ్లీ మళ్లీ సోమనాథ మందరిం పునర్వైభవంతో నిలిచింది.

గతంలో నా సోమనాథ్‌ పర్యటనలకు సంబంధించిన కొన్ని చిత్రాలను మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా సోమనాథ్‌ను సందర్శించి ఉంటే, #SomnathSwabhimanParv హ్యాష్‌ట్యాగ్‌తో మీ చిత్రాలను పంచుకోండి.”

“ఈ #SomnathSwabhimanParv.. సిద్దాంతాలూ, విలువల విషయంలో ఎన్నడూ రాజీపడని అసంఖ్యాకులైన భరతమాత బిడ్డలను స్మరించుకునే వేడుక. సమయమెంత కఠినంగా, భీకరంగా ఉన్నప్పటికీ.. వారి సంకల్పం ఎన్నడూ చెక్కుచెదరలేదు. మన నాగరికత, సాంస్కృతిక చేతన పట్ల వారి నిష్ట ఏమాత్రమూ సడలలేదు. వెయ్యేళ్ల అచంచలమైన విశ్వాసానికి ప్రతీక అయిన ఈ సందర్భం.. దేశ ఐక్యత దిశగా నిరంతరం కృషి చేసేలా మనకు స్ఫూర్తినిస్తుంది.”

“2001 అక్టోబర్ 31న సోమనాథ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలను నేను మీతో పంచుకుంటున్నాను. 1951లో పునర్నిర్మితమైన సోమనాథ మందిర ప్రారంభానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఉత్సవమది. ఆ చారిత్రక వేడుక 1951లో నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో జరిగింది. సోమనాథ మందిర పునర్నిర్మాణంలో సర్దార్ పటేల్, కె.ఎం. మున్షీతోపాటు ఎందరో మహనీయుల కృషి నిజంగా అత్యంత ప్రశంసనీయం. 2001లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాటి ప్రధానమంత్రి అటల్ గారు, హోం మంత్రి అద్వాణీ గారు, అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

1951 నాటి ఆ భవ్యమైన వేడుకకు 2026 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్నాయి.”

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఓ సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ.. శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“శ్రీ సోమనాథ మహాదేవుడి దయ, ఆశీస్సులు అదరికీ శుభాన్ని చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను.

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసమ్

భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే.”

 

***


(रिलीज़ आईडी: 2212570) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam