ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వికసిత భారత్ నిర్మాణంలో యువత పాత్రను వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 08 JAN 2026 2:06PM by PIB Hyderabad

దేశంలో నిర్ణయాత్మక క్షణాలను రూపొందించడంలో భారతీయ యువత పోషిస్తున్న పాత్రను వివరిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

దేశాన్ని నిర్వచించే ముఖ్యమైన సందర్భాలను భారతీయ యువత నిరంతరం రూపుదిద్దుతూనే ఉందని ఈ కథనం వివరిస్తుందిముందుండి నాయకత్వం వహించాలనిజాతీయ సవాళ్లను ఎదుర్కోవాలనివికసిత భారత్ దిశగా తమ ఆకాంక్షలను మలుచుకోవాలని యువతకు పిలుపునిచ్చే ఉద్యమంగా ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌’ను వర్ణించింది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘దేశాన్ని నిర్వచించే క్షణాలను భారతీయ యువత నిరంతరం తీర్చిదిద్దుతోందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ @mansukhmandviya ఈ ఆలోచనాత్మక కథనంలో వివరించారు.

ముందుండి నాయకత్వం వహించాలనిజాతీయ సవాళ్లను ఎదుర్కోవాలనివికసిత్ భారత్ సాధన దిశగా తమ లక్ష్యాలను మలుచుకోవాలని యువతకు పిలుపునిచ్చే ఉద్యమంగా ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌’ను మంత్రి వర్ణించారు.


(रिलीज़ आईडी: 2212560) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam