ప్రధాన మంత్రి కార్యాలయం
సద్గుణం, శీలం, జ్ఞానం, ధనం.. వీటి శాశ్వత విలువల్ని చాటిచెప్పే సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
07 JAN 2026 8:57AM by PIB Hyderabad
భారతీయ సంప్రదాయాల శాశ్వత విలువలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ప్రస్తావించారు. ఈ విలువలు దేశ ప్రజలందరి జీవన విధానంతో పాటు వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉండాలో మార్గదర్శకాన్ని అందిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
సిసలైన సౌందర్యం సద్గుణాలతో ప్రకాశిస్తుందనీ, శీలంతో వంశం గొప్పతనాన్ని అందిపుచ్చుకొంటుందనీ, సాఫల్యంలో జ్ఞానం విలువ ఇమిడి ఉంటుందనీ, బాధ్యతతో వినియోగించినప్పుడే ధనానికి సార్థకత లభిస్తుందనీ ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ విలువలు శాశ్వతమైనవే కాకుండా, సమకాలీన సమాజంలో అత్యంత సందర్భశుద్ధిని కలిగివున్నాయని ఆయన అన్నారు. ఈ విలువలు భారత ప్రగతి, బాధ్యత, సద్భావనల సామూహిక ప్రస్థానానికి దారిని చూపుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఓ సంస్కృత శ్లోకాన్ని ప్రజలతో పంచుకుంటూ, ఇలా రాశారు:
‘‘గుణో భూషయతే రూపం శీలం భూషయతే కులమ్
సిద్ధిర్భూషయతే విద్యాం భోగో భూషయతే ధనమ్.’’
***
(रिलीज़ आईडी: 2212283)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam