రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వ్యవసాయ వ్యర్థాలను విలువైన జాతీయ వనరుగా మార్చవచ్చన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
వికసిత భారత్ 2047 దార్శనికతను ముందుకు తీసుకెళ్లే విప్లవాత్మక చర్య జైవిక తారు
జైవిక తారును వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తున్న తొలి దేశంగా భారత్..
దేశ రోడ్డు మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం
प्रविष्टि तिथि:
07 JAN 2026 3:23PM by PIB Hyderabad
వ్యవసాయ వ్యర్థాలను విలువైన జాతీయ వనరుగా ఎలా మార్చవచ్చో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ వివరించారు. జైవిక తారు వికసిత్ భారత్ 2047 దార్శనికతను ముందుకు తీసుకెళ్ళే ఒక విప్లవాత్మక చర్యగా ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా పంట కాల్చడం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించి, సర్క్యులర్ ఎకనామీని బలోపేతం చేస్తుంది. 15 శాతం మిశ్రమంతో భారత్ సుమారు రూ. 4,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవచ్చు. అలాగే దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
“వ్యవసాయ అవశేషాల నుంచి రోడ్డు వరకు: పైరోలైసిస్ ద్వారా జైవిక తారు” ఇతివృత్తంతో జరిగిన సీఎస్ఐఆర్ సాంకేతిక బదిలీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరి మాట్లాడుతూ.. ‘నేడు దేశ రోడ్డు మౌలిక సదుపాయాల్లో ఒక చారిత్రక మైలురాయిని సూచిస్తోందన్నారు. వాణిజ్యపరంగా జైవిక తారును వాణిజ్యంగా ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే భారత్ మొదటి దేశంగా నిలిచిందని తెలిపారు. సీఎస్ఐఆర్, వారి నిబద్ధతగల శాస్త్రవేత్తలను కేంద్రమంత్రి అభినందించారు. ఈ మార్గదర్శక పురోగతిని సాధించడంలో స్థిరమైన మద్దతు అందించిన కేంద్రమంత్రి శ్రీ జితేంద్ర సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ నూతన ఆవిష్కరణలు రైతులకు సాధికారత కల్పించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని కల్పిస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని శ్రీ గడ్కరీ తెలిపారు. సుస్థిర అభివృద్ధి, స్వయం సమృద్ధి, పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన వృద్ధి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు జైవిక తారు నిదర్శనమని అన్నారు. ఇది పరిశుభ్రమైన, పచ్చని భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2212269)
आगंतुक पटल : 17