ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ప్రధానికి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని


· పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు... ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్ష

· భారత్ - ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఉమ్మడి ప్రాధాన్యాలను గుర్తించిన ఇద్దరు ప్రధానులు

· ఏ రూపంలో ఉన్నా, ఏ రకంగా వ్యక్తమైనా.. ఉగ్రవాదాన్ని సహించబోమని పునరుద్ఘాటన

· గాజా శాంతి ప్రణాళిక అమలుపై భారత ప్రధానికి వివరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

· ఈ ప్రాంతంలో న్యాయబద్ధమైన, శాశ్వత శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు భారత నిరంతర మద్దతును పునరుద్ఘాటించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 07 JAN 2026 3:02PM by PIB Hyderabad

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గౌరవ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ లో సంభాషించారు.

వారిద్దరూ పరస్పరం నూతన సంవత్సర ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకొన్నారురెండు దేశాల ప్రజలు శాంతిసౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలుబలమైన పరస్పర విశ్వాసంభవిష్యత్ దృక్పథాల మార్గనిర్దేశంలో.. ఈ ఏడాది భారత్ – ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఉమ్మడి ప్రాధాన్యాలను వారు గుర్తించారు.

ఏ రూపంలో ఉన్నాఏ రకంగా వ్యక్తమైనా ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రధానులిద్దరూ పునరుద్ఘాటించారుఈ ముప్పును ఎదుర్కోవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

గాజా శాంతి ప్రణాళిక అమలుపై భారత ప్రధానమంత్రి శ్రీ మోదీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు వివరించారుఆ ప్రాంతంలో న్యాయమైనశాశ్వత శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చించారు.

సంప్రదింపులను కొనసాగించాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు.

 

*** 


(रिलीज़ आईडी: 2212263) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam