మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల ఉర్దూ సంకలనం


“ఖుత్బాత్-ఎ-మోదీ: లాల్ ఖిలా కి ఫసీల్ సే” పుస్తకాన్ని విడుదల చేసిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

प्रविष्टि तिथि: 05 JAN 2026 5:42PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు న్యూఢిల్లీలో “ఖుత్బత్--మోదీలాల్ ఖిలా కీ ఫసీల్ సే” పుస్తకాన్ని విడుదల చేశారుఈ పుస్తకం 2014 నుంచి 2025 మధ్య కాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల ఉర్దూ సంకలనం.

ఉర్దూలో ప్రచురించిన ఈ పుస్తకాన్ని దేశవ్యాప్తంగా ఉర్దూ భాషను ప్రోత్సహించడంసంరక్షించడంప్రచారం చేయడం లక్ష్యంగా... విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ (ఎన్‌సీపీయూఎల్ప్రచురించింది.

ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ... 'ఖుత్బాత్--మోదీఉర్దూలో ప్రచురితం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారుభాషా సమ్మిళితత్వం దిశగా ఒక అర్థవంతమైన చర్యగా దీనిని ఆయన అభివర్ణించారుప్రధానమంత్రి ప్రసంగాల్లో అంత్యోదయ పేదల సంక్షేమంస్వచ్ఛ భారత్జాతీయ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారని తెలిపారుఇది నవ భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి ఆలోచనలుఅభివృద్ధి ప్రాధాన్యాలుదార్శనికతలతో పౌరులను నేరుగా అనుసంధానించడంలో ఇటువంటి ప్రచురణలు శక్తిమంతమైన మాధ్యమంగా పనిచేస్తాయని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారువిస్తృత ప్రజా భాగస్వామ్యానికిసమాచార వెల్లడికీ ఇవి వీలు కల్పిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారుదేశవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో ఈ పుస్తకం అందుబాటులో ఉంటుందన్న ఆయన... విద్యార్థులుపండితులుపాఠకులు వికసిత్ భారత్ దార్శనికతపై విస్తృత సంభాషణల్లో పాలుపంచుకునేలా ఇది వారిని ప్రోత్సహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత వారసత్వంసంస్కృతిజీవనశైలిజ్ఞాన సంప్రదాయాలకు సంబంధించిన రచనలను ఉర్దూలో ప్రచురించే బాధ్యతను ఎన్‌సీపీయూఎల్ మరింత ఉత్సాహంగా కొనసాగించాలని కేంద్ర మంత్రి కోరారుఈ ప్రశంసనీయ చొరవకు ఎన్‌సీపీయూఎల్‌ను శ్రీ ప్రధాన్ అభినందించారుభవిష్యత్ ప్రయత్నాల కోసం తన శుభాకాంక్షలు తెలిపారు.

"ఖుత్బాత్--మోదీనవ భారత్ పరివర్తనాత్మక ప్రయాణాన్ని తెలియజేస్తుందిఅదే సమయంలో దేశవ్యాప్తంగా ఉర్దూ పాఠకులకు కీలక జాతీయ ప్రసంగాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భాషా సమ్మిళితత్వం పట్ల ప్రభుత్వ నిబద్ధతనూ ఇది పునరుద్ఘాటిస్తుంది.

విద్యా మంత్రిత్వ శాఖ (ఉన్నత విద్యకార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి... భారతీయ భాషా సమితి చైర్మన్ పద్మశ్రీ చాము కృష్ణ శాస్త్రి... ఎన్‌సీపీయూఎల్ డైరెక్టర్ డాక్టర్ షమ్స్ ఇక్బాల్... అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ నైమా ఖాతూన్... ఎన్‌సీఎంఈఐ చైర్మన్ డాక్టర్ షాహిద్ అక్తర్... విద్యా మంత్రిత్వ శాఖ సలహాదారు (కాస్ట్శ్రీమతి మన్మోహన్ కౌర్... విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి రీనా సోనోవాల్ కౌలీ... విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ పీకేబెనర్జీ... సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

***


(रिलीज़ आईडी: 2211644) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil