ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సోమనాథ్ దేవాలయానికి 1000 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు

प्रविष्टि तिथि: 05 JAN 2026 8:59AM by PIB Hyderabad

సోమనాథ్ దేవాలయంపై క్రీ.శ. 1026లో తొలి దాడి తరువాత 1000 సంవత్సరాలు పూర్తి అయిన చరిత్రాత్మక సందర్భంగా ప్రధానమంత్రి ఒక సంపాదకీయ లేఖను ప్రజలతో పంచుకున్నారు.
వందల ఏళ్లుగా చాలా సార్లు దాడులు జరిగినప్పటికీ సోమనాథ్ దేవాలయం భారత మొక్కవోని చైతన్యానికి ప్రతీకగా ఈనాటికీ సమున్నతంగా నిలిచి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సోమనాథ్ గాథ కేవలం ఒక దేవాలయానిదే కాదనీ, అది భారత మాత అసంఖ్యాక ముద్దుబిడ్డల అజేయ సాహస గాథ అనీ, వాళ్లు దేశ సంస్కృతినీ, నాగరికతనూ పరిరక్షించారనీ ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వేర్వేరు సందేశాల్లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘జై సోమనాథ్.
సోమనాథ్ దేవాలయంపై మొదటిసారి దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తి అయిన ఘట్టానికి 2026వ సంవత్సరం ప్రతీకగా ఉంది. ఆ దాడి తరువాత మళ్లీ మళ్లీ దాడులు జరిగినా సోమనాథ్ నేటికీ చెక్కుచెదరక నిలిచింది. దీనికి కారణం, సోమనాథ్ దేవాలయ గాధ భారత మాత అసంఖ్యాక ముద్దుబిడ్డల మొక్కవోని సాహస గాథ.. వాళ్లు మన సంస్కృతినీ, నాగరికతనూ రక్షించారు.
ఈ విషయంపై నేను రాసిన సంపాదకీయ వ్యాసాన్ని ఇదుగో ఇక్కడ చూడగలరు.  
#SomnathSwabhimanParv
https://www.narendramodi.in/somnath-swabhiman-parv-a-1000-years-of-unbroken-faith-1026-2026


(रिलीज़ आईडी: 2211531) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam