సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'బదల్‌తా భారత్ మేరా అనుభవ్' సృజనాత్మక పోటీల విజేతల ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 03 JAN 2026 12:42PM by PIB Hyderabad

'బదల్‌తా భారత్ మేరా అనుభవ్' ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నాలుగు సృజనాత్మక పోటీల విజేతలను భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మైగవ్ సహకారంతో ఈ పోటీలను నిర్వహించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో 11 ఏళ్లలో భారత్‌లో వచ్చిన మార్పులను ప్రతిబింబించేలా వ్యక్తిగత అనుభవాలు, సృజనాత్మక అభిప్రాయాలను పంచుకోవాలని దేశవ్యాప్తంగా పౌరులను ఆహ్వానించింది.

'వికసిత్ భారత్ @2047’ లక్ష్యాలకు అనుగుణంగా సాగిన ఈ ప్రచారంలో వివిధ వయసుల వారు, విభిన్న నేపథ్యాలకు చెందిన పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరిపాలనలో వచ్చిన మార్పులు, పలు రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని వినూత్న పద్ధతుల ద్వారా ప్రజలకు తెలియజేశారు. దీని ద్వారా పౌరుల గళం బలంగా వినిపించటమే కాక, అభివృద్ధి చెందిన భారత్ దిశగా సాగుతున్న ప్రయాణంలో ప్రజా భాగస్వామ్యం మరింత బలపడింది. ఈ కార్యక్రమం, క్షేత్రస్థాయి నుంచి సృజనాత్మక ప్రదర్శనల వరకు ప్రతి భారతీయుడిని భాగస్వామ్యం చేస్తూ, స్ఫూర్తినిస్తూ, వారి గళాన్ని చాటిచెప్పింది.

విభాగాల వారీగా విజేతలు:

1. బదల్‌తా భారత్ మేరా అనుభవ్ - ఇన్‌స్టాగ్రామ్ రీల్ పోటీలు

  • మొదటి బహుమతి: ఇంద్రజీత్ సుబోధ్ మశంకర్

  • రెండో బహుమతి: మంజరి వి మహజన్

  • మూడో బహుమతి: మిష్టి లోహార్

  • ఏడు ప్రోత్సాహక బహుమతులు: మహమ్మద్ హజీమ్ రాథర్, అనుభవి సిన్హా, ఆయుష్మాన్ బర్మయా, సిద్ధార్థ్ ఎం, కార్తిక్ బట్నాగర్, ఐశ్వర్య కుమావత్, అతిశ్ మొహపాత్ర.

2. బదల్‌తా భారత్ మేరా అనుభవ్ - యూట్యూబ్ షార్ట్స్ పోటీలు

  • మొదటి బహుమతి: మంథన్ రోహిత్

  • రెండో బహుమతి: జేఆర్ ట్యూబ్ ఛానెల్

  • మూడో బహుమతి: లేఖ చేతన్ కొఠారి

  • ఏడు ప్రోత్సాహక బహుమతులు: సౌమితా దత్తా, హైమంతి మీట్, దినేశ్ చోటియా, దివ్య బిష్ణోయ్, తపేశ్, సిద్ధార్థ్ ఎం, దినేశ్ కుమార్

3. షార్ట్ ఏవీ పోటీలు - స్టోరీ ఆఫ్ న్యూ ఇండియా

  • మొదటి బహుమతి: సుశోవన్ మన్నా

  • రెండో బహుమతి: పాప్పే సోమ్

  • మూడో బహుమతి: రవి పరిహార్

  • రెండు ప్రోత్సాహక బహుమతులు: దినేశ్ చోటియా, సిద్ధార్థ్ ఎం

4. బదల్‌తా భారత్ మేరా అనుభవ్ - బ్లాగ్ రైటింగ్ పోటీలు

  • మొదటి బహుమతి: కృష్ణ గుప్తా

  • రెండో బహుమతి: సింజినీ ఛటర్జీ

  • మూడో బహుమతి: బృందా సోమాని

  • ఏడు ప్రోత్సాహక బహుమతులు: నుపూర్ జోషి, త్రిషా సింగ్ బఘేల్, మీనాక్షి బన్సాలి, విశ్వనాథ్ క్లైర్, నందని భావ్సార్, శ్రీరామ్‌గణేశ్, అపూర్వ

 

'బదల్‌తా భారత్ మేరా అనుభవ్' ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, వికసిత్ భారత్‌పై కథనాలను పంచుకున్న విజేతలకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అభినందనలు తెలిపింది. విజేతలందరూ సృజనాత్మకతతో ఈ పరివర్తన ప్రయాణంలో ముందుకు సాగాలని కోరింది.

 

***


(రిలీజ్ ఐడి: 2211486) సందర్శకుల సూచీ సంఖ్య : : 80
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , Punjabi , Kannada , Urdu , English , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam