ప్రధాన మంత్రి కార్యాలయం
సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
03 JAN 2026 8:07AM by PIB Hyderabad
సేవ, విద్య ద్వారా సమాజంలో మార్పు కోసం జీవితాన్ని అంకితం చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా, ఆమె సేవలను స్మరించుకుంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
సమానత్వం, న్యాయం, కరుణ వంటి ఉన్నత ఆశయాలకు సావిత్రిబాయి ఫూలే ప్రాధాన్యతనిచ్చేవారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సమాజంలో సమూల మార్పునకు శక్తిమంతమైన సాధనం విద్యేనని ఆమె బలంగా నమ్మారని తెలిపారు. జ్ఞానం, సాధన ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆమె జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు.
పేదలు, అణగారిన వర్గాల పట్ల ఆమె చూపిన సేవాభావం, మానవత్వం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ అంటూ సావిత్రిబాయి విశేష కృషిని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. సమ్మిళిత, సాధికారత సమాజం కోసం దేశ ప్రయత్నాలకు ఆమె దార్శనికత మార్గదర్శకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రత్యేక పోస్టులో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
"సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా సేవ, విద్య ద్వారా సమాజ మార్పునకు జీవితాన్ని అంకితం చేసిన ఆ మార్గదర్శిని స్మరించుకుందాం. సమానత్వం, న్యాయం, కరుణ వంటి సూత్రాలకు ప్రాధాన్యతనిస్తూ ఆమె పనిచేశారు. సమాజంలో మార్పునకు శక్తిమంతమైన సాధనం విద్య అని ఆమె బలంగా విశ్వసించారు. కేవలం జ్ఞానాన్ని అందించటమే కాక, కొత్త విషయాలను నేర్చుకోవటం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేశారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి ఆమె చేసిన సేవలు ప్రశంసనీయం"
***
(रिलीज़ आईडी: 2211483)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada