ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాణి వేలు నాచియార్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 03 JAN 2026 8:16AM by PIB Hyderabad

దేశంలోని అత్యంత పరాక్రమవంతురాలైన యోధుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాణి వేలు నాచియార్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులు అర్పించారు. ధైర్యసాహసాలు, వ్యూహాత్మక నైపుణ్యాలు మూర్తీభవించిన గొప్ప పోరాట యోధురాలిగా ఆమె చిరస్మరణీయులు అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

రాణి వేలు నాచియార్ వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, తమను తాము పరిపాలించుకునే భారతీయుల హక్కును గురించి ప్రజలను జాగృతం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సుపరిపాలన, సాంస్కృతిక గర్వం పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.

ఆమె త్యాగం, దార్శనిక నాయకత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందనీ... భారత ప్రగతి ప్రయాణంలో ధైర్యం, దేశభక్తికి దీపస్తంభంగా పనిచేస్తుందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"రాణి వేలు నాచియార్ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు. ధైర్యం, వ్యూహాత్మక నైపుణ్యాలు మూర్తీభవించిన అత్యంత పరాక్రమవంతులైన భారత యోధుల్లో ఒకరిగా ఆమె చిసర్మరణీయులు. వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా ఆమె తిరుగుబాటు చేసి... తమను తాము పరిపాలించుకునే భారతీయుల హక్కును గురించి ప్రజలను జాగృతం చేశారు. సుపరిపాలన, సాంస్కృతిక గర్వం పట్ల ఆమె నిబద్ధత ప్రశంసనీయం. ఆమె త్యాగం, దార్శనిక నాయకత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి."

 

***


(रिलीज़ आईडी: 2211482) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam