సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పీహెచ్‌డీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐఐఎంసీ: 60 ఏళ్ల విద్యా చరిత్రలో కొత్త అధ్యాయం
మీడియా కమ్యూనికేషన్ స్టడీస్‌లో మొట్టమొదటి పీహెచ్‌డీ కార్యక్రమానికి ప్రవేశాలను ప్రారంభించిన ఐఐఎంసీ
జర్నలిజం, డిజిటల్ మీడియా, వ్యూహాత్మక కమ్యూనికేషన్‌లో పరిశోధనను బలోపేతం చేయడానికి డాక్టోరల్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఐఐఎంసీ
प्रविष्टि तिथि:
02 JAN 2026 8:14PM by PIB Hyderabad
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) 2026 జనవరి ఒకటో తేదీన తమ పీహెచ్‌డీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇది 60 ఏళ్ల ఈ సంస్థ విద్యా ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. 2025-26 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కార్యక్రమంలో ప్రవేశం కోసం పరిశోధకులను ఎంపిక చేస్తారు.

ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ అభ్యర్థుల కోసం జనవరి ఒకటి, 2026 న ప్రారంభమైన ఆన్‌లైన్ ప్రవేశ ప్రక్రియ 30 జనవరి 2026 వరకు కొనసాగుతుంది. యూజీసీ-నెట్ అర్హతతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను నేరుగా వ్యక్తిగత ఇంటరాక్షన్ కోసం పిలుస్తారు. యూజీసీ-నెట్ అర్హత లేని పార్ట్‌టైమ్ అభ్యర్థులు 15 ఫిబ్రవరి 2026న నిర్వహించే ప్రవేశ పరీక్షలో పాల్గొనాలి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను 23 ఫిబ్రవరి 2026న విడుదల చేస్తారు. ఇంటర్వ్యూలు 9 మార్చి 2026 నుంచి ప్రారంభమవుతాయి. ప్రవేశ ప్రక్రియ 27 మార్చి 2026 నాటికి పూర్తి అవుతుంది, కోర్స్ వర్క్ ఏప్రిల్ ఒకటి 2026న ప్రారంభమవుతుంది.
పీహెచ్‌డీ ప్రవేశాల పోర్టల్‌ను ప్రారంభించిన సందర్భంగా ఐఐఎంసీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రజ్ఞా పాలివాల్ గౌర్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న భారతదేశం కోసం చేసే పరిశోధనకు సహకారం అందించడమే ఈ పీహెచ్‌డీ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. సాధారణ ఆలోచనలకు భిన్నంగా, సమాజానికి, దేశానికి పెద్ద ఎత్తున సహాయపడే పరిశోధన ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.

ఐఐఎంసీలోపీహెచ్‌డీ కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా వైస్ ఛాన్సలర్ న్యూఢిల్లీ క్యాంపస్‌లో 'కోవిదార' మొక్కను 'జ్ఞాన వృక్షం'గా నాటారు.

ఐఐఎంసీలో పీహెచ్‌డీ కార్యక్రమాన్ని జర్నలిజం, కమ్యూనికేషన్, అనుబంధ రంగాలలో కఠినమైన ప్రమాణాలతో విద్యను అందించడానికి, ఇంటర్ డిసిప్లినరీ స్కాలర్‌షిప్‌ను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన సముదాయానికి దోహదపడటానికి ఉద్దేశించారు. మీడియా, కమ్యూనికేషన్ స్టడీస్‌లో అభివృద్ధి చెందుతున్న రంగాన్ని అన్వేషించడానికి, దానికి సహకరించడానికి ఆసక్తి ఉన్న వారి కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం పరిశోధక విద్యార్థులకు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, డిజిటల్ మీడియా, వ్యూహాత్మక కమ్యూనికేషన్, మీడియా రంగ నిర్వహణ, ఫిల్మ్ స్టడీస్, రాజకీయ కమ్యూనికేషన్, అభివృద్ధి కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్, ప్రజా సంబంధాలు వంటి విభాగాలలో సమగ్ర అధ్యయనాలు నిర్వహించడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనను ప్రోత్సహిస్తుంది. మీడియా పరిశోధనలో ఆవిష్కరణలను, మేధోపరమైన ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
***
(रिलीज़ आईडी: 2211481)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Gujarati
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi