కేంద్ర మంత్రివర్గ సచివాలయం
ప్రగతి @ 50: చురుకైన, సాంకేతికత ఆధారిత పాలనను సంస్థాగతీకరించడం
प्रविष्टि तिथि:
02 JAN 2026 7:30PM by PIB Hyderabad
ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ప్రగతి యంత్రాంగ (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) సమీక్షా సమావేశ ఫలితాలను కేబినెట్ కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శులు ఈ రోజు మీడియాకు వివరించారు.
ప్రగతి (PRAGATI) యంత్రాంగం ద్వారా ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయికి నివేదిస్తూ వాటి పరిష్కారాన్ని వేగవంతం చేసే నిర్మాణాత్మక విధానాన్ని అనుసరిస్తున్నట్లు వారు తెలిపారు. నిరంతర పర్యవేక్షణకు... బహుళ స్థాయిలలో, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు.
ప్రారంభంలో సమస్యలను మంత్రిత్వ శాఖ స్థాయిలో పరిష్కరిస్తారనీ... సంక్లిష్టమైన సమస్యలను సమీక్షలో ఉన్నతస్థాయికి నివేదించి సంబంధిత సంస్థాగత యంత్రాంగాల ద్వారా వాటిని పరిష్కరిస్తారనీ కేబినెట్ కార్యదర్శి వివరించారు. గౌరవనీయ ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ప్రగతి (PRAGATI) సమీక్షా సమావేశాలతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని వారు స్పష్టం చేశారు.
సమస్యలను ఉన్నత స్థాయికి నివేదించే ఈ విధానం... జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టుల విషయంలో మంత్రిత్వ శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టడం, సకాలంలో నిర్ణయం తీసుకోవడం, అమలు విషయంలో అడ్డంకులను పరిష్కరించడానికి హామీనిస్తుందన్నారు. అత్యున్నత స్థాయిలో నిరంతర పర్యవేక్షణ, సమీక్ష ద్వారా అమలు విషయంలో జవాబుదారీతనం పెంచడానికి, ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడానికి ప్రగతి (PRAGATI) ప్రభావవంతమైన వేదికగా పనిచేస్తుందని కేబినెట్ కార్యదర్శి వివరించారు.
ప్రజెంటేషన్ లింక్: https://pmiic-local-files.s3.ap-south-1.amazonaws.com/1767360837863-Press_Conference_02.01.2026__v5_PDF.pdf
ఆక్స్‌ఫర్డ్ సెడ్ బిజినెస్ స్కూల్ స్టడీ లింక్: https://ora.ox.ac.uk/objects/uuid:34268453-91fb-4dd3-b052-90fbb52fe247/files/s1j92g9820
***
(रिलीज़ आईडी: 2211479)
आगंतुक पटल : 9