ప్రధాన మంత్రి కార్యాలయం
రాయ్ పిథోరాలో నిర్వహిస్తున్న పిప్రాహ్వా అవశేషాల ప్రదర్శనను సందర్శించాలని పౌరులకు ప్రధానమంత్రి పిలుపు
భగవాన్ బుద్ధుని ఉన్నత భావాలను మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే మా నిబద్ధతకు అనుగుణంగా పిప్రాహ్వా అవశేషాల ప్రదర్శన: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 JAN 2026 6:16PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో “ది లైట్ అండ్ ది లోటస్: బుద్ధుని పవిత్ర అవశేషాలు” పేరుతో ఏర్పాటు చేసిన పవిత్ర పిప్రాహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.
మన సంస్కృతి పట్ల, బౌద్ధమతం పట్ల మక్కువ ఉన్న వారంతా ఈ ప్రదర్శనను సందర్శించి... పిప్రాహ్వా పవిత్ర వారసత్వాన్ని అనుభూతి చెందాలని పౌరులకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
ఒక శతాబ్దానికి పైగా కాలం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన పిప్రాహ్వా పవిత్ర అవశేషాలను ఈ ప్రదర్శన ఒకచోటకు చేర్చుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇది న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియం, కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం సేకరణల్లో భద్రపరచిన పిప్రాహ్వాకు చెందిన ప్రామాణిక అవశేషాలను, పురాతన వస్తువులనూ ప్రదర్శించనుంది.
‘ఎక్స్’ వేదికగా చేసిన వేర్వేరు పోస్టుల ద్వారా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“రేపు అంటే జనవరి 3వ తేదీ... మన చరిత్ర, సంస్కృతి, భగవాన్ బుద్ధుని ఆదర్శాల పట్ల మక్కువ ఉన్నవారికి చాలా ప్రత్యేకమైన రోజు.
భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రాహ్వా అవశేషాలతో... 'ది లైట్ అండ్ ది లోటస్: బుద్ధుని పవిత్ర అవశేషాలు' పేరుతో బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శన ఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ ప్రదర్శన వీటిని ఒకచోటకు చేర్చుతుంది:
వందకు పైగా సంవత్సరాల తర్వాత స్వదేశానికి తిరిగి తెచ్చిన పిప్రాహ్వా అవశేషాలు...
న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియం, కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం సేకరణల్లో జాగ్రత్తగా భద్రపరిచిన పిప్రాహ్వాకు చెందిన ప్రామాణిక అవశేషాలు, పురాతన వస్తువులు...
“ఈ ప్రదర్శన భగవాన్ బుద్ధుని ఉన్నతమైన ఆలోచనలను మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే మా నిబద్ధతకు అనుగుణంగా ఉంది. ఇది మన యువతకు, మన గొప్ప సంస్కృతికి మధ్య బంధాన్ని మరింతగా బలపరిచే ఒక ప్రయత్నం కూడా. ఈ పవిత్ర అవశేషాలను మన దేశానికి తిరిగి తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ నేను అభినందించాలనుకుంటున్నాను.”
“ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ పవిత్ర పిప్రాహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శనలోని కొన్ని ప్రధాన దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. మన సంస్కృతి పట్ల, బౌద్ధమతం పట్ల ఆసక్తి ఉన్న వారంతా ఈ ప్రదర్శనకు తరలి రావాలని నేను పిలుపునిస్తున్నాను.”
***
(रिलीज़ आईडी: 2211477)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam