ప్రధాన మంత్రి కార్యాలయం
సద్గుణాలతో పరిపూర్ణం కావడమే జీవన లక్ష్యమని చాటి చెప్పే సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
01 JAN 2026 8:12AM by PIB Hyderabad
నూతన సంవత్సరం 2026 సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఓ సుభాషితంలో సూచించిన ప్రకారం.. జ్ఞానం, వైరాగ్యం, ధనం, వీరత్వం, శక్తి, సామర్థ్యం, స్మృతి, స్వాతంత్య్రం, కౌశలం, ప్రతిభ, ధైర్యంలతో పాటు కోమలత్వం వంటి మంచి గుణాలతో పరిపూర్ణం కావడమే జీవన లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
ప్రధానమంత్రి ప్రాచీన జ్ఞానాన్ని ఉదాహరిస్తూ,
‘‘కొత్త సంవత్సరం 2026 సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ కొత్త ఆశలనీ, కొత్త సంకల్పాన్నీ, అలాగే కొత్త ఆత్మవిశ్వాసాన్నీ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. జీవన గమనంలో ముందడుగు వేయడానికి ఈ సంవత్సరం అందరికీ ప్రేరణను అందించుగాక.
జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతి:స్వాతంత్య్రం కౌశలం కాన్తిర్ధైర్యం మార్దవమేవ చ’’
(रिलीज़ आईडी: 2210457)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam