ప్రధాన మంత్రి కార్యాలయం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా మృతికి సంతాపం తెలిపిన పీఎం
प्रविष्टि तिथि:
30 DEC 2025 9:53AM by PIB Hyderabad
ఢాఖాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ ఛైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:
‘‘ఢాకాలో మాజీ ప్రధానమంత్రి, బీఎన్పీ ఛైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా మృతి చెందారన్న వార్త తీవ్రంగా కలచి వేసింది.
ఆమె కుటుంబానికీ, బంగ్లాదేశ్ ప్రజలకూ హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దుఃఖాన్ని భరించే ధైర్యాన్ని ఆమె కుటుంబానికి భగవంతుడు ప్రసాదించుగాక!
బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధానమంత్రిగా.. ఆ దేశ అభివృద్ధికి, భారత్-బంగ్లా సంబంధాలకు ఆమె అందించిన సహకారం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
ఢాకాలో 2015లో ఆమెతో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటున్నాను. మన భాగస్వామ్యానికి ఆమె లక్ష్యం, వారసత్వం మార్గనిర్దేశం అందిస్తాయని విశ్వసిస్తున్నా.
ఆమె ఆత్మకు శాంతి చేకూరుగాక!’’
***
(रिलीज़ आईडी: 2209700)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam