ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్-2025లో కాంస్య పతకం సాధించిన కోనేరు హంపిని అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
29 DEC 2025 3:12PM by PIB Hyderabad
దోహాలో జరిగిన ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్-2025లో మహిళల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన కోనేరు హంపిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. "ఆటపై ఆమెకున్న అంకితభావం ప్రశంసనీయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"కోనేరు హంపికి శుభాకాంక్షలు. దోహాలో జరిగిన ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్-2025లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మహిళల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించటం అభినందనీయం. ఆటపై ఆమెకున్న అంకితభావం ప్రశంసనీయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను"
(रिलीज़ आईडी: 2209692)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Malayalam
,
Kannada
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati