ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి నివాళులర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
27 DEC 2025 10:44AM by PIB Hyderabad
ఇవాళ పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. గురు గోవింద్ జీ.. ధైర్యం, కరుణ, త్యాగానికి ప్రతీక అని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. "సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడేందుకు, మానవాళి గౌరవాన్ని రక్షించేందుకు ఆయన జీవితం, బోధనలు స్ఫూర్తినిస్తాయి. శ్రీ గురు గోవింద్ సింగ్ దార్శనికత.. సేవ, నిస్వార్థ కర్తవ్యం వైపు తరతరాలను నడిపిస్తూనే ఉంటుంది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి భక్తితో నా నమస్కారాలు అర్పిస్తున్నా. ధైర్యం, కరుణ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం గోవింద్ జీ. సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడాలని, మానవాళి గౌరవాన్ని కాపాడాలని ఆయన జీవితం, బోధనలు మనకు తెలియజేస్తాయి. శ్రీ గురు గోవింద్ సింగ్ ఆశయాలు.. సేవ, నిస్వార్థ కర్తవ్యం వైపు తరతరాలను నడిపిస్తాయి.
ఈ ఏడాది ప్రారంభంలో నేను తఖ్త్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్‌ను సందర్శించినప్పటి చిత్రాలు ఇవి. అక్కడ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ, మాతా సాహిబ్ కౌర్ జీల పవిత్ర జోరే సాహిబ్ దర్శన భాగ్యం కలిగింది"
(रिलीज़ आईडी: 2209098)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam