రాష్ట్రపతి సచివాలయం
‘రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు- 2025’ను ప్రదానం చేసిన రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
23 DEC 2025 6:25PM by PIB Hyderabad
ఈ రోజు (2025 డిసెంబర్ 23) రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ ఏడాది రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను అందజేశారు.
రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల రెండో ఎడిషన్‌లో భాగంగా విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ, విజ్ఞాన్ టీమ్ అనే నాలుగు విభాగాలలో మొత్తం 24 అవార్డులను శాస్త్రవేత్తలకు అందించారు.
శాస్త్ర సాంకేతికత, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణల వంటి వివిధ రంగాలలో వ్యక్తిగతంగా లేదా బృందాలుగా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు చేసిన విశేషమైన కృషిని గుర్తించడమే ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల ప్రధాన లక్ష్యం.
రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార గ్రహీతల జాబితా
(रिलीज़ आईडी: 2207935)
आगंतुक पटल : 6