హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వామి శ్రద్ధానంద్‌ బలిదాన్ దివస్.. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు


స్వరాజ్, భారతీయ సంస్కృతి.. ఈ రెండింటి కోసం సమానంగా సేవలు అందించిన స్వామి శ్రద్ధానంద్ సరస్వతి జీ
సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా జీవన పర్యంతం పోరాడారు

మహిళలకు విద్యావకాశాలనూ, భారత్ జ్ఞాన పరంపరనూ ప్రోత్సహించడంలో ఆయన పోషించిన పాత్ర

प्रविष्टि तिथि: 23 DEC 2025 11:33AM by PIB Hyderabad

స్వామి శ్రద్ధానంద్ బలిదాన్ దివస్ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు..: స్వామి శ్రద్ధానంద్ సరస్వతి గారు స్వరాజ్‌ సాధనతో పాటు భారతీయ సంస్కృతి పరిరక్షణకు సమానంగా సేవలను అందించారు. సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా జీవన పర్యంతం పోరాడారు. మహిళలకు విద్యావకాశాల్నీ, భారతీయ జ్ఞాన పరంపరనీ ప్రోత్సహించడంలో ఆయన పోషించిన పాత్ర మర్చిపోలేనిది. స్వామి శ్రద్ధానంద్ జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయనకు ఇవే నివాళులు. 

 

***


(रिलीज़ आईडी: 2207666) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam