హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నౌకలు, ఓడరేవు సౌకర్యాల భద్రత కోసం బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ (బీఓపీఎస్‌)ని ఏర్పాటు చేయడంపై సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్‌ షా


దేశవ్యాప్తంగా బలమైన ఓడరేవు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్న కేంద్ర హోం మంత్రి

భద్రతా చర్యలను అంచెలవారీగా, ప్రమాద స్థాయి ఆధారంగా అమలు చేయాలని..వాటి బలహీనతలు, వాణిజ్య సామర్థ్యం, ప్రాంతం తదితర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం

ఇటీవల ప్రకటించిన మర్చంట్ షిప్పింగ్ చట్టం 2025లోని సెక్షన్ 13లోని నిబంధనల ప్రకారం బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు

బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తరహాలో ఈ సంస్థ రూపకల్పన

ఓడరేవుల సాంకేతిక మౌలిక సదుపాయాలను డిజిటల్ ముప్పుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక విభాగంతో సహా, సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, భద్రతా సంబంధిత సమాచారాన్ని సకాలంలో విశ్లేషించడం, సేకరించడం, పరస్పర మార్పిడి చేయడం బీఓపీఎస్‌ బాధ్యత

ఓడరేవుల సౌకర్యాల కోసం సీఐఎస్‌ఎఫ్‌ను గుర్తింపు పొందిన భద్రతా సంస్థగా నియామకం.. ఓడరేవుల కోసం భద్రతా అంచనాలను చేపట్టడం, భద్రతా ప్రణాళికలను రూపొందించడం సీఐఎస్‌ఎఫ్‌ బాధ్యత

प्रविष्टि तिथि: 19 DEC 2025 12:40PM by PIB Hyderabad

ఓడరేవులు, నౌకల భద్రత కోసం బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ’(బీఓపీఎస్‌) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, పౌర విమానయాన శాఖ మంత్రులు కూడా పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా పటిష్టమైన ఓడరేవుల భద్రతా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని శ్రీ అమిత్షా పేర్కొన్నారుభద్రతా చర్యలను అంచెల వారీగాప్రమాద తీవ్రత ఆధారంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఓడరేవుల భద్రతను నిర్ణయించేటప్పుడు వాటి లోపాలు,వాణిజ్య సామర్థ్యం, భౌగోళిక ప్రాంతం, ఇతర ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

కొత్తగా తీసుకొచ్చిన మర్చంట్ షిప్పింగ్ చట్టం 2025 లోని సెక్షన్ 13 లోని నిబంధనల ప్రకారం బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు కాబోతుంది. ఈ సంస్థ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీనికి డైరెక్టర్ జనరల్ నాయకత్వం వహిస్తారు. నౌకలు, ఓడరేవు సౌకర్యాల భద్రతకు సంబంధించి నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలను ఇది చూసుకుంటుంది. దీనిని పౌర విమానయాన భద్రతా సంస్థ అయిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తరహాలోనే రూపొందిస్తున్నారు.  ఐపీఎస్‌ అధికారి బీఓపీఎస్కు (పే లెవల్-15) నేతృత్వం వహిస్తారు. మొదటి సంవత్సరం మాత్రం డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ దీనికి డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తారు.

భద్రతా సంబంధిత సమాచారాన్ని సకాలంలో విశ్లేషించడం, సేకరించడం, మయానుకూలంగా పంచుకోవడంలో బీఓపీఎస్‌ కీలకపాత్ర పోషిస్తుందిముఖ్యంగా డిజిటల్ ముప్పుల నుంచి ఓడరేవుల సాంకేతిక మౌలిక సదుపాయాలను రక్షించడానికి ఒక ప్రత్యేక విభాగం కూడా ఉంటుంది. ఓడరేవు భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఓడరేవు సౌకర్యాల కోసం గుర్తింపు పొందిన భద్రత సంస్థగా నియమించారు.ఇది ఓడరేవుల వద్ద భద్రత అంచనాలను రూపొందించడం, భద్రతా ప్రణాళికలను సిద్దం చేసే బాధ్యతను చూసుకుంటుంది.

ఓడరేవుల భద్రతలో నిమగ్నమైన ప్రైవేటు భద్రతా సంస్థలకు శిక్షణ ఇవ్వడం, వారి సామర్థ్యాన్ని పెంపొందించే బాధ్యతను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి అప్పగించారు. ఈ సంస్థలకు తప్పనిసరిగా సర్టిఫికేషన్ ఇస్తారు. తగిన లైసెన్స్ ఉన్న ప్రైవేటు భద్రతా సంస్థలు మాత్రమే ఈ రంగంలో పనిచేసేలా కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టారునౌకాయాన భద్రతా వ్యవస్థలో పాటించే పటిష్ట చర్యలను విజయవంతమైన పద్ధతులను విమానయాన భద్రతా రంగంలో కూడా అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

 

***


(रिलीज़ आईडी: 2207061) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam