సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వానికి సంబంధించి అనుమానాస్పదమైన నకిలీ వార్తలపై 8799711259 నంబర్‌కు పంపాలని ప్రజలకు సూచించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్

డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు వాస్తవ సమాచారం చేరువయ్యేలా చూడటం దీని ప్రధాన లక్ష్యం

प्रविष्टि तिथि: 19 DEC 2025 8:00PM by PIB Hyderabad

భారత ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నవంబర్ 2019లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను (ఎఫ్‌సీయూ) ఏర్పాటు చేసింది.

ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై ప్రచారంలో ఉన్న నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాల గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే, లేదా వాస్తవాలను తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబర్‌ 918799711259, ఈమెయిల్: factcheck@pib.gov.in, అధికారిక వెబ్‌సైట్: https://factcheck.pib.gov.in ను సంప్రదించవచ్చు.

పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తనకు అందిన వార్తలను లేదా సమాచారాన్ని కింది విధంగా తనిఖీ చేస్తుంది.

·        సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలను స్వయంగా గమనిస్తుంది. అతేకాకుండా వెబ్‌సైట్ లేదా వాట్సాప్ నెంబర్‌ ద్వారా ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరిస్తుంది.

·        అందిన సమాచారం తమ పరిధిలోకి వస్తుందో లేదో నిర్ధారిస్తుంది. ఆ తర్వాతే ఆ సమాచారాన్ని వేరు చేసి తదుపరి పరిశీలనకు పంపుతుంది.

·   అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారంలోని వాస్తవికతను ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ ధృవీకరిస్తుంది. సమాచార నిర్ధరణ తర్వాత  సమాచారం, విద్య, కమ్యూనికేషన్ వ్యూహాన్ని ఉపయోగించి ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది.సోషల్ మీడియాలో సులభంగా అర్థమయ్యేలా సృజనాత్మక సమాచారాన్ని సిద్ధం చేస్తుంది.

·        సరైన సమాచారాన్ని తన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువేస్తుంది.

భారత ప్రభుత్వానికి సంబంధించి ఆన్‌లైన్ సమాచారాన్ని పర్యవేక్షించడంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుంది ఆపరేషన్ సిందూర్ సమయంలో వచ్చిన తప్పుడు సమాచారాన్ని తక్షణమే తనిఖీ చేసి సరైన సమాచారాన్ని ప్రజలకు అందించింది. ఖచ్చితమైన సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ప్రజలు గందరగోళానికి గురవ్వకుండా సహాయపడింది. ఆన్‌లైన్‌లో వ్యాపించే తప్పుడు సమాచారం, ప్రతికూల కథనాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్‌పై వ్యతిరేక ప్రచారాలు పెరగకుండా నివారించడంలో ఈ విభాగం ఎంతో సహాయపడింది.

ఈ సమాచారాన్ని కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ శ్రీ ఎల్. మురుగన్ ఈరోజు రాజ్యసభలో శ్రీ సుజీత్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2207056) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Assamese , Kannada , Malayalam