ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లును ప్రస్తావిస్తూ రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
20 DEC 2025 3:22PM by PIB Hyderabad
వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లు లక్ష్యాలను వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లు గ్రామీణ జీవనోపాధిని ఎలా మెరుగుపరుస్తుందో ఈ వ్యాసం వివరిస్తుంది. ఉపాధి హామీని బలోపేతం చేయడం, స్థానిక ప్రణాళికలను సమగ్రంగా చేర్చడం, కార్మికుల భద్రతను వ్యవసాయ ఉత్పాదకతతో సమతుల్యం చేయడం, వివిధ పథకాల సమన్వయం, క్షేత్రస్థాయి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, పాలనను ఆధునీకరించడం వంటి అంశాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించనుందని వ్యాసం పేర్కొంది. అలాగే ఈ బిల్లు సామాజిక రక్షణ నుంచి తిరోగమనం కాదని, దానికి కొత్త రూపాన్ని ఇవ్వడమేనని తెలిపింది.
కేంద్ర మంత్రి రాసిన కథనానికి ప్రతిస్పందిస్తూ శ్రీ మోదీ ఇలా అన్నారు.
"కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఈ అద్భుతమైన వ్యాసంలో.. వికసిత్ భారత్ - జీ రామ్ జీ బిల్లు ద్వారా గ్రామీణ జీవనోపాధిని ఎలా మార్చవచ్చో వివరించారు. ఉపాధి హామీని మెరుగుపరచడం, స్థానిక ప్రణాళికలను భాగం చేయడం, కార్మికుల భద్రతను వ్యవసాయ ఉత్పాదకతతో సమతుల్యం చేయడం, వివిధ పథకాలను అనుసంధానించడం, క్షేత్రస్థాయి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, పాలనను ఆధునీకరించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
ఈ బిల్లు సామాజిక రక్షణ నుంచి వెనక్కి తగ్గడం కాదు-అది సామాజిక రక్షణకు కొత్త పునరుజ్జీవం అని స్పష్టం చేశారు’’
(रिलीज़ आईडी: 2207039)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam