ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: ఒమన్‌లోని భారతీయ సమాజం, విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 18 DEC 2025 2:45PM by PIB Hyderabad

నమస్తే!

అహ్లాన్ వ సహ్లాన్ !!!

మీ యువ ఉత్సాహంశక్తి ఇక్కడి వాతావరణాన్ని నిజంగా ఉత్తేజపరిచాయిఈ హాల్‌ సరిపోకపోవటంతో పక్కనే ఉన్న హాల్‌లోని తెరలపై ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న సోదరీసోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానుఇంత దూరం వచ్చి కూడా ఈ హాల్‌లోకి ప్రవేశించలేకపోయినందుకు వారు ఏమనుకుంటున్నారో మీరు ఊహించొచ్చు.

మిత్రులారా,

నా ముందు నేను ఒక మినీ-ఇండియాను చూస్తున్నానుఇక్కడ మలయాళీలు కూడా చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను.

సుఖమ్ ఆణో

కేవలం మలయాళం మాట్లాడేవారే కాదు.. తమిళంతెలుగుకన్నడగుజరాతీ మాట్లాడే వారు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు.

నలమా?
బాగున్నారా?
చెన్నాగిద్దీరా?
కెమ్ ఛో?

మిత్రులారా,

ఈ రోజు మనమంతా ఒక కుటుంబంలా ఇక్కడ సమావేశమయ్యాంఈ రోజు మనం మన దేశాన్నిమన 'టీమ్ ఇండియా'ను వేడుకగా చేసుకుంటున్నాం

మిత్రులారా,

భారతదేశంలో వైవిధ్యమే మన సంస్కృతికి బలమైన పునాదిజీవితంలో ప్రతి రోజు ఒక కొత్త రంగును నింపుతుందిప్రతి రుతువు ఒక వేడుకగా మారుతుందిప్రతి సంప్రదాయం ఒక సరికొత్త ఆలోచనను తెస్తుందిఅందుకే భారతీయులం ఎక్కడికి వెళ్లినాఎక్కడ నివసించినా వైవిధ్యాన్ని గౌరవిస్తాంమనం స్థానిక సంస్కృతిసంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటాంఈ రోజు ఒమన్‌లో కూడా నేను అదే స్ఫూర్తిని చూస్తున్నాను.

ఈ భారతీయ ప్రవాస సమాజం సహజీవనంసహకారానికి ఒక సజీవ ఉదాహరణగా నిలిచింది.

మిత్రులారా,

భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఇటీవల మరో అద్భుతమైన గుర్తింపు లభించిందిమీకు తెలిసే ఉంటుంది.. యునెస్కో దీపావళిని అమూర్త వారసత్వ జాబితాలో చేర్చింది.

ఇప్పుడు దీపావళి దీపం కేవలం మన ఇళ్లకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి వెలుగునిస్తుందిఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణందీపావళికి లభించిన ఈ ప్రపంచ గుర్తింపు మనం పంచుకునే కాంతిరేఖను గౌరవిస్తుందిఆ కాంతి ఆశసామరస్యంమానవత్వాన్ని పెంచుతుంది.

మిత్రులారా,

ఈ రోజు మనమందరం భారత్-ఒమన్ స్నేహానికి సంబంధించిన ఉత్సవం (మైత్రీ పర్వాన్ని)" చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాం

మైత్రి (ఎంఏఐటీఆర్ఐఅంటే:

ఎం సముద్ర వారసత్వం
ఏ ఆకాంక్షలు
ఐ ఆవిష్కరణ
టీ నమ్మకంసాంకేతికత
ఆర్ గౌరవం
ఐ సమ్మిళిత వృద్ధి

మరో రకంగా చెప్పాలంటే ఈ "మైత్రీ పర్వంమన రెండు దేశాల మధ్య ఉన్న బంధంమన ఉమ్మడి చరిత్రమన సుసంపన్నమైన భవిష్యత్తును వేడుకగా చేసుకుంటోందిభారత్ఒమన్ దేశాలు శతాబ్దాలుగా సాన్నిహిత్యాన్నిశక్తిమంతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి.

హిందూ మహాసముద్రపు రుతుపవనాలు ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి మార్గనిర్దేశం చేశాయిమన పూర్వీకులు లోథల్మాండ్వితామ్రలిప్తి వంటి ఓడరేవుల నుంచి మస్కట్సూర్సలాలా వరకు చెక్క పడవల్లో ప్రయాణించారు.

మిత్రులారా,

మాండ్విమస్కట్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను వివరిస్తూ మన రాయబార కార్యాలయం ఒక పుస్తకాన్ని రూపొందించినందుకు నేను చాలా సంతోషిస్తున్నానుఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ఈ పుస్తకాన్ని చదివి మీ ఒమనీ స్నేహితులతో పంచుకోవాలని నేను కోరుతున్నాను.

పాఠశాలలో టీచర్లు హోంవర్క్ ఇస్తారు ఇక్కడేమో మోదీ గారు హోంవర్క్ ఇచ్చారని ఇప్పుడు మీరు అనుకోవచ్చు.

మిత్రులారా,

భారత్ఒమన్ కేవలం భౌగోళికంగానే కాకుండా తరతరాలుగా అనుసంధానమై ఉన్న విషయాన్ని ఈ పుస్తకం తెలియజేస్తోందిఈ శతాబ్దాల నాటి బంధాలకు మీరే గొప్ప సంరక్షకులు.

మిత్రులారా,

"భారత్‌ గురించి తెలుసుకోండిఅనే క్విజ్‌లో ఒమన్ నుంచి భారీగా పాల్గొన్నారని నాకు తెలిసిందిఒమన్ నుంచి  పది వేల మందికి పైగా ఈ క్విజ్‌లో పాల్గొన్నారుప్రపంచవ్యాప్తంగా ఒమన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.

కానీ నేను ఇప్పుడే చప్పట్లు కొట్టనుఒమన్ మొదటి స్థానంలో ఉండాలివీలైనంత ఎక్కువ మంది పాల్గొనటం ద్వారా ఇంకా పెద్ద ఎత్తున స్పందన వస్తుందని నేను ఆశిస్తున్నానుభారతీయ పిల్లలు ఖచ్చితంగా పాల్గొనాలిఅలాగే మీ ఒమనీ స్నేహితులను కూడా ఈ క్విజ్‌లో పాల్గొనాలని మీరు ప్రోత్సహించాలి.

మిత్రులారా,

వ్యాపారంతో మొదలైన భారత్-ఒమన్ సంబంధాలు ఇప్పుడు విద్య ద్వారా మరింత బలోపేతం అవుతున్నాయిఇక్కడి భారతీయ పాఠశాలల్లో సుమారు 46,000 మంది విద్యార్థులు చదువుతున్నారని.. వారిలో ఒమన్‌లోని ఇతర వర్గాలకు చెందిన వేలాది మంది పిల్లలు కూడా ఉన్నారన్న విషయం నాకు తెలిసిందిఒమన్‌లో భారతీయ విద్యకు యాభై ఏళ్లు పూర్తవుతున్నాయిఇది మన రెండు దేశాల మధ్య సంబంధాలలో ఒక ముఖ్యమైన ఘట్టం

మిత్రులారా,

దివంగత సుల్తాన్ ఖాబూస్ గారి కృషి లేకుండా భారతీయ పాఠశాలల విజయం సాధ్యమయ్యేది కాదుమస్కట్‌లోని ఇండియన్ స్కూల్‌తో సహా భారతీయ పాఠశాలల కోసం ఆయన భూమిఅవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించారుగౌరవ సుల్తాన్ హైతం గారు ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక్కడి భారతీయ సమాజానికి అందిస్తున్న మద్దతురక్షణ పట్ల వారికి నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

మిత్రులారా,

మీకందరికీ 'పరీక్షా పే చర్చకార్యక్రమం సుపరిచితమేఒమన్ నుంచి కూడా చాలా మంది విద్యార్థులు ఇందులో పాల్గొంటుంటారుపరీక్షలను ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడానికి విద్యార్థులుతల్లిదండ్రులకు ఈ చర్చలు మార్గదర్శకంగా ఉంటూ అందరికీ సహాయపడుతున్నాయని నేను నమ్ముతున్నాను.

మిత్రులారా,

ఒమన్‌లో నివసిస్తున్న భారతీయులు తరచుగా భారతదేశానికి ప్రయాణిస్తుంటారు.. దేశంలోని ప్రతి పరిణామాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారుకొత్త పురోగతితో భారత్‌ ఎలా ముందుకు సాగుతుందో మీరందరూ చూస్తున్నారుఈ వేగం మా ఉద్దేశాన్ని తెలియజేస్తోంది.. మా పనితీరులో స్పష్టంగా కనిపిస్తుంది.

కొద్ది రోజుల క్రితమే ఆర్థిక వృద్ధి గణాంకాలు విడుదలయ్యాయిమీకు తెలిసే ఉంటుంది.. భారత వృద్ధి శాతం కంటే మించిపోయిందిప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోందనేది దీని అర్థంప్రపంచమంతా సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఇది సాధ్యమైందిఅతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కనీసం తక్కువ శాతం వృద్ధిని సాధించడానికి కూడా కష్టపడుతుంటే భారత్ మాత్రం అధిక వృద్ధి పథంలో కొనసాగుతోందిఇది నేటి భారతదేశ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది

మిత్రులారా

నేడు భారతదేశం ప్రతి రంగంలోనూ మునుపెన్నడూ లేని వేగంతో పని చేస్తోందిగత పదకొండు ఏళ్లకు సంబంధించిన కొన్ని గణాంకాలను నేను మీతో పంచుకుంటానుఅవి మిమ్మల్ని కూడా గర్వంతో నింపుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను

ఇక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులుతల్లిదండ్రులు ఉన్నందున నేను విద్యానైపుణ్య రంగంతో ప్రారంభిస్తానుగత పదకొండు ఏళ్లలో భారత్‌లో వేలాది కొత్త కళాశాలలు ఏర్పాటయ్యాయి

ఐఐటీల సంఖ్య పదహారు నుంచి ఇరవై మూడుకు పెరిగిందిపదకొండు ఏళ్ల క్రితం దేశంలో 13 ఐఐఎంలు ఉండేవి.. నేడు 21 ఉన్నాయిఅదేవిధంగా ఎయిమ్స్ విషయానికొస్తే.. 2014 కంటే ముందు కేవలం ఏడు మాత్రమే ఉండేవి నేడు దేశంలో 22 ఎయిమ్స్ ఉన్నాయి.

భారత్‌లో మెడికల్ కాలేజీల సంఖ్య 400 కంటే తక్కువగా ఉండేది.. నేడు దేశవ్యాప్తంగా సుమారు 800 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.

మిత్రులారా,

నేడు మనం అభివృద్ధి చెందిన భారత్‌ కోసం మన విద్యానైపుణ్య వ్యవస్థను సిద్ధం చేస్తున్నాంఇందులో నూతన విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తోందిఈ విధానంలో భాగంగా పద్నాలుగు వేలకు పైగా 'పీఎం శ్రీపాఠశాలలు వస్తున్నాయి

మిత్రులారా,

పాఠశాలలుకళాశాలలువిశ్వవిద్యాలయాలు పెరిగినప్పుడు కేవలం భవనాలు నిర్మాణమే జరగదు.. దేశ భవిష్యత్తు బలోపేతం అవుతుంది.

మిత్రులారా,
దేశాభివృద్ధి వేగంవిస్తృతి విద్యారంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయిగత పదకొండు సంవత్సరాల కాలంలో దేశంలో... అమర్చిన సౌరశక్తి సామర్థ్యం ముప్పై రెట్లు పెరిగిందిసౌర మాడ్యూళ్ల తయారీ పది రెట్లు వృద్ధి చెందిందిఈ విధంగా దేశం హరిత వృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది.

భారత్ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిన్‌టెక్ వ్యవస్థకు నిలయంగా ఉందిరెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారురెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగానూ భారత్ ముందంజలో ఉంది.

మిత్రులారా,
మన దేశానికి వచ్చే వారంతా మన ఆధునిక మౌలిక సదుపాయాలను చూసి ఆశ్చర్యపోతున్నారుగత పదకొండు సంవత్సరాల కాలంలో మౌలిక సదుపాయాల్లో ఐదు రెట్లు ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్లే ఇది సాధ్యమైంది.

విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయిందిగతంలో కంటే ఇప్పుడు రెట్టింపు వేగంతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నాంరైల్వే మార్గాలను వేగంగా వేస్తున్నాంరైల్వే విద్యుదీకరణ పనులూ వేగంగా సాగుతున్నాయి.

మిత్రులారా,
ఈ గణాంకాలు కేవలం విజయాలు మాత్రమే కాదు... ఇవి అభివృద్ధి చెందిన భారత్ దార్శనికత సాకారం దిశగా గొప్ప ముందడుగులుఇరవై ఒకటో శతాబ్దంలో దేశం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోందివేగంగా పనిచేస్తోందిప్రతిష్ఠాత్మక లక్ష్యాలను సాధిస్తోందినిర్ణీత కాలపరిమితిలో ఫలితాలనూ అందిస్తుంది.

మిత్రులారా,
మరో గర్వకారణమైన విషయాన్ని పంచుకుంటానుప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలనూ ఈ రోజు భారత్ నిర్మిస్తోంది.

మన దేశ యూపీఐ... అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థగా నిలిచిందిఈ చెల్లింపుల వ్యవస్థ పరిధిని మీకు తెలియజేయడం కోసం నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.

నేను ఇక్కడకు వచ్చి సుమారు 30 నిమిషాలు అయ్యిందిఈ 30 నిమిషాల వ్యవధిలోనేమన దేశంలో యూపీఐ ద్వారా సుమారు 1.4 కోట్ల రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపులు జరిగాయిఈ లావాదేవీల మొత్తం విలువ రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందిపెద్ద షోరూమ్‌ల నుంచి చిన్న వ్యాపారుల దాకా దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ చెల్లింపు వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారు.

మిత్రులారా,
ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు... కాబట్టి నేను మరో ఆసక్తికరమైన ఉదాహరణను చెప్పాలనుకుంటున్నానుదేశం ఒక ఆధునిక డిజిలాకర్ వ్యవస్థను అభివృద్ధి చేసిందిదేశంలో బోర్డు పరీక్షలు నిర్వహించిన తరువాత వారి మార్క్ షీట్లను నేరుగా విద్యార్థుల డిజిలాకర్ ఖాతాల్లోకి అప్‌లోడ్ చేస్తారుపుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం దాకా ప్రభుత్వం జారీ చేసిన ఏ పత్రాన్ని అయినా డిజిలాకర్‌లో భద్రంగా ఉంచవచ్చుఇటువంటి అనేక డిజిటల్ వ్యవస్థలు దేశవ్యాప్తంగా జీవన సౌలభ్యాన్ని అందిస్తున్నాయి.

మిత్రులారా,
మన దేశం సాధించిన చంద్రయాన్ మిషన్ అద్భుతాన్ని మీరంతా చూశారుచంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న ప్రపంచంలోనే మొదటి దేశంగా మనం ఘనతను సాధించాంఅంతేకాకుండాఒకే మిషన్‌లో ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి మనం అరుదైన రికార్డునూ సృష్టించాం.

గగన్‌యాన్ కార్యక్రమం కింద దేశం ఇప్పుడు మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాంత్వరలోనే అంతరిక్ష కక్ష్యలో మన సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటయ్యే రోజూ మరెంతో దూరంలో లేదు.

మిత్రులారా,
భారత అంతరిక్ష కార్యక్రమం కేవలం మన దేశ సరిహద్దులకే పరిమితం కాదుమనం ఒమన్ అంతరిక్ష ఆకాంక్షలకూ మద్దతునిస్తున్నాంఆరు-ఏడు సంవత్సరాల కిందటఅంతరిక్ష సహకారం గురించిన ఒక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయిఇండియా-ఒమన్ స్పేస్ పోర్టల్‌ను ఇస్రో అభివృద్ధి చేసిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నానుఈ అంతరిక్ష భాగస్వామ్యం ద్వారా ఒమన్ యువతకూ ప్రయోజనం కలిగేలా నిరంతర ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇక్కడ ఉన్న విద్యార్థులతో నేను మరో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ‘యువికా’ పేరుతో ఇస్రో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందిఇది వేలాది మంది భారతీయ విద్యార్థులను అంతరిక్ష విజ్ఞానంతో అనుసంధానిస్తుందిఈ కార్యక్రమంలో ఒమన్ విద్యార్థులకూ పాల్గొనే అవకాశాన్ని కల్పించడమే మా ప్రస్తుత ప్రయత్నం.

ఒమన్‌కు చెందిన కొంతమంది విద్యార్థులు బెంగళూరులోని ఇస్రో కేంద్రాన్ని సందర్శించి అక్కడ కొంత సమయం గడపాలని నేను కోరుకుంటున్నానుఇది ఒమనీ యువత అంతరిక్ష ఆకాంక్షలను కొత్త శిఖరాలకు చేర్చడానికి ఒక అద్భుతమైన ప్రారంభం కాగలదు.

మిత్రులారా,
ఈ రోజు భారత్ తన సొంత సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడమే కాకుండాఈ పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా చేయడంపై కృషి చేస్తోంది.

సాఫ్ట్‌వేర్ అభివృద్ధి నుంచి పేరోల్ నిర్వహణ వరకు... డేటా విశ్లేషణ నుంచి కస్టమర్ సపోర్ట్ వరకు... అనేక అంతర్జాతీయ బ్రాండ్‌లు భారత ప్రతిభా బలంతోనే ముందుకు సాగుతున్నాయి.

దశాబ్దాలుగా మన దేశం ఐటీఐటీ ఆధారిత సేవల రంగంలో ప్రపంచ శక్తిగా వెలుగొందుతోందిమనం తయారీ రంగాన్ని ఐటీ శక్తితో అనుసంధానిస్తున్నాందీని వెనుక ఉన్న సిద్ధాంతం 'వసుధైక కుటుంబభావన నుంచి స్ఫూర్తి పొందినదేఅంటే ప్రపంచమంతా ఒకే కుటుంబంఈ ఆలోచనే 'మేక్ ఇన్ ఇండియామేక్ ఫర్ ది వరల్డ్అనే నినాదంలోనూ ప్రతిబింబిస్తుంది.

మిత్రులారా,
టీకాలైనా... సాధారణ మందులైనా... ప్రపంచం మనల్ని 'ప్రపంచ ఔషధ కేంద్రంగా పిలుస్తోందిదేశం అందించే సరసమైనఅధిక నాణ్యత గల ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయి.

కోవిడ్ సమయంలోనూ మన దేశం ప్రపంచానికి దాదాపు 30 కోట్ల టీకాలను అందించింది. 'మేడ్ ఇన్ ఇండియాకోవిడ్ టీకాల్లో సుమారు లక్ష టీకాలు ఒమన్ ప్రజలకూ ఉపయోగపడటం నాకు సంతోషం కలిగించింది.

మిత్రులారా,
గుర్తుంచుకోండి... మిగతా వారంతా తమ గురించి తామే ఆలోచిస్తున్న సమయంలోనూ భారత్ ఈ పనిని చేసిందిభారత్ ప్రపంచం గురించి ఆలోచించిందిభారత్ తమ 140 కోట్ల మంది పౌరులకు రికార్డు సమయంలో విజయవంతంగా టీకాలు వేయడంతో పాటుగా ప్రపంచ అవసరాలనూ తీర్చింది.

ఇది భారత్ నమూనాఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచానికి కొత్త ఆశను అందించే నమూనాఅందుకే ఈ రోజు భారత్ 'మేక్ ఇన్ ఇండియాచిప్‌లను తయారు చేస్తూ... ఏఐక్వాంటం కంప్యూటింగ్గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో మిషన్ మోడ్‌లో పనిచేస్తోందిభారత్ సాధించే విజయం తమకూ సహకారాన్నిమద్దతును అందిస్తుందనే ఆశను ఇతర దేశాల్లోనూ కల్పిస్తోంది.

మిత్రులారా,
మీరు ఒమన్‌లో చదువుకుంటున్నారుఉద్యోగం చేస్తున్నారురాబోయే సంవత్సరాల్లో మీరు ఒమన్భారత్ రెండు దేశాల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తారుప్రపంచానికి నాయకత్వం వహించబోయే తరం మీరే.

ఒమన్‌లో నివసిస్తున్న భారతీయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఒమన్ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తోందిభారత ప్రభుత్వం మీ సౌకర్యం పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తోందిఒమన్ వ్యాప్తంగా పదకొండు కాన్సులర్ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

మిత్రులారా,
గత దశాబ్దంలో ప్రపంచంలో తలెత్తిన ప్రతి సంక్షోభ సమయంలోనూ మన ప్రభుత్వం భారతీయులకు సహాయం చేయడానికి వేగంగా స్పందించిందిప్రపంచంలో భారతీయులు ఎక్కడ నివసిస్తున్నా... మన ప్రభుత్వం ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలుస్తోందివారికి మద్దతుగా ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ప్రత్యేక సహాయ పోర్టల్స్ప్రవాసీ భారతీయ బీమా యోజన వంటి కార్యక్రమాలను చేపట్టింది.

మిత్రులారా,
ఈ ప్రాంతంలో భారత్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందిఒమన్ మాకు మరింత ముఖ్యమైనదిభారత్-ఒమన్ సంబంధాలు ఇప్పుడు నైపుణ్యాభివృద్ధిడిజిటల్ అభ్యసనంవిద్యార్థుల రాకపోకలువ్యవస్థాపకత వంటి రంగాలకు విస్తరిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

రాబోయే సంవత్సరాల్లో భారత్-ఒమన్ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే యువ ఆవిష్కర్తలు మీ నుంచే ఉద్భవిస్తారని నేను నమ్మకంగా ఉన్నానుఇక్కడ ఉన్న భారతీయ పాఠశాలలు ఇప్పుడే తమ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాయిరాబోయే 50 సంవత్సరాల లక్ష్యాలతో మనం ఇప్పుడు ముందుకు సాగాలిమీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే:

పెద్ద కలలు కనండి.
లోతుగా నేర్చుకోండి.
ధైర్యంగా ఆవిష్కరణలు చేయండి.
ఎందుకంటే మీ భవిష్యత్తు కేవలం మీది మాత్రమే కాదు... యావత్ మానవజాతి భవిష్యత్తు.

మీ అందరికీ ఉజ్వలమైనసుసంపన్నమైన భవిష్యత్తు లభించాలని కోరుకుంటూ నేను మరోసారి మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు!

గమనికఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.

 

***


(रिलीज़ आईडी: 2206495) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Gujarati , Odia , Kannada , Malayalam