ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సమ్రాట్ పెరుంబిడుగు ముథరైయర్ - II గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 14 DEC 2025 10:05PM by PIB Hyderabad

సమ్రాట్ పెరుంబిడుగు ముథరైయర్ - II (సువరన్ మారన్గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శ్రీ సి.పిరాధాకృష్ణన్ ఈ రోజు విడుదల చేయడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.
సమ్రాట్ పెరుంబిడుగు ముథరైయర్ - II శక్తిమంతుడైన పరిపాలకుడనీఆయన విజన్దూరదృష్టిలతో పాటు వ్యూహాత్మక కౌశలం కూడా అద్భుతమైనవనీ శ్రీ మోదీ అన్నారున్యాయం పట్ల సమ్రాట్ నిబద్ధత తిరుగులేనిదనీతమిళ సంస్కృతిని ఆయన గొప్పగా పరిరక్షించారనీ శ్రీ మోదీ స్పష్టం చేశారు.
పూజ్య సమ్రాట్ అసాధారణ జీవనాన్ని గురించీవారసత్వాన్ని గురించీ మరిన్ని విషయాలను తెలుసుకోవాల్సిందిగా దేశ ప్రజలకుప్రత్యేకించి యువతకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారుసమ్రాట్ అందించిన సేవలు ఇప్పటికీ భిన్న తరాల వారికి స్ఫూర్తినిస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు
:
‘‘
సమ్రాట్ పెరుంబిడుగు ముథరైయర్ - II (సువరన్ మారన్గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి తిరు సి.పిరాధాకృష్ణన్ గారు విడుదల చేయడం నాకెంతో సంతోషాన్నిచ్చిందిసమ్రాట్ గొప్ప పరిపాలకుడుఆయన విజన్దూరదృష్టివ్యూహాత్మక కౌశలం అద్భుతమైనవిన్యాయం పట్ల నిబద్ధత కనబరిచి ఆయన ఎంతో పేరుప్రతిష్ఠలు తెచ్చుకున్నారుతమిళ సంస్కృతిని గొప్పగా పరిరక్షించారుఆయన అసాధారణ జీవితం గురించి తెలుసుకోవాల్సిందిగా మరింత యువతీ యువకులను నేను కోరుతున్నాను’’.

 

***


(रिलीज़ आईडी: 2204194) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam