ప్రధాన మంత్రి కార్యాలయం
నిజమైన ఆనందం స్వావలంబనతోనే లభిస్తుందంటూ ఓ సంస్కృత శ్లోకాన్ని ఉదాహరించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 DEC 2025 8:41AM by PIB Hyderabad
వ్యక్తిగత పురోగతితో పాటు దేశ ప్రగతిలో క్రమశిక్షణ, స్వావలంబన కీలక పాత్రను పోషిస్తాయని భారతీయ సంస్కృతి చాటిచెబుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.
ఒక సంస్కృత సూక్తిని ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఉదాహరించారు. ఇతరులపై ఆధారపడితే కష్టాలు ఎదురవుతాయనీ, స్వీయ కర్మలను నియంత్రించుకొంటూ ఉంటే ఎప్పటికీ ఆనందంగా ఉండడం సాధ్యపడుతుందనీ ఆ శ్లోకం సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ సంస్కృతంలో ఇలా రాశారు:
‘‘సర్వ పరవశం దుఃఖమ్ సర్వమాత్మావశం సుఖమ్
ఏతద్ విద్వత్ సమాసేన లక్షణం సుఖదు:ఖయో:’’
***
(రిలీజ్ ఐడి: 2204189)
సందర్శకుల సూచీ సంఖ్య : : 31
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam