ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆస్ట్రేలియలో ఉగ్రవాద దాడిని ఖండించిన ప్రధానమంత్రి ఈ దారుణ ఘటన మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 14 DEC 2025 5:23PM by PIB Hyderabad

ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో ఈ రోజు యూదుల పండుగ హనుక్కా తొలి రోజు వేడుకలే లక్ష్యంగా జరిగిన దారుణ ఉగ్రవాద దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.

ఈ విషాద ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన శ్రీ నరేంద్ర మోదీ... మృతుల కుటుంబాలకు భారత ప్రజల తరపున ప్రగాఢ సంతాపం తెలిపారుఈ తీవ్ర విషాద సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు భారత్ పూర్తి సంఘీభావం ప్రకటిస్తోందని ఆయన తెలిపారు.

ఈ అంశంపై భారత్ విస్పష్ట వైఖరిని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి... ఉగ్రవాదం పట్ల భారత్ ఎలాంటి ఉదాసీనత లేని విధానంతో ముందుసాగుతోందన్నారుఉగ్రవాదపు రూపాలువ్యక్తీకరణలన్నింటికి వ్యతిరేకంగా ప్రపంచస్థాయి పోరాటానికి భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో ఈ రోజు యూదుల పండుగ హనుక్కా తొలి రోజు వేడుకల్లో అక్కడి ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దారుణ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానుభారత ప్రజల తరపున మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానుఈ విషాద సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నాంఉగ్రవాదం పట్ల ఎలాంటి ఉదాసీనత లేని వైఖరిని భారత్ కొనసాగిస్తుందిఉగ్రవాద రూపాలువ్యక్తీకరణలన్నింటికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి భారత్ సంపూర్ణ మద్దతునిస్తుంది."

 

***


(रिलीज़ आईडी: 2204178) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada