సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వయస్సుకు తగని కంటెంట్ నుంచి పిల్లల భద్రత కోసం ఓటీటీ వేదికలపై గట్టి ఆంక్షలు విధించిన ప్రభుత్వం


డిజిటల్ మీడియాలో నైతిక విలువల కోసం ఐటీ రూల్స్, 2021 కింద తీసుకున్న చర్యలను ప్రముఖంగా పేర్కొన్న కేంద్రం

प्रविष्टि तिथि: 12 DEC 2025 4:42PM by PIB Hyderabad

భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) వాక్ స్వేచ్ఛకు హామీ ఇచ్చిందిఅదే సమయంలోడిజిటల్ వేదికల్లో నకిలీఅసత్యతప్పుదారి పట్టించే సమాచారం వల్ల సమాజానికి కలుగుతున్న నష్టాలను ప్రభుత్వం కూడా గుర్తించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 (25 ఫిబ్రవరి, 2021) కింద ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలుడిజిటల్ మీడియా నైతిక నియమావళి) 2021 నిబంధనలను  ప్రభుత్వం నోటిఫై చేసింది.

ఈ నిబంధనలలోని మూడో భాగం ఆన్‌లైన్ క్యురేటెడ్ కంటెంట్ (ఓటీటీ వేదికలునిర్వాహకుల కోసం నైతిక నియమావళిని నిర్దేశిస్తుందిఈ నియమావళి ప్రకారంఅమలులో ఉన్న చట్టాల కింద నిషేధించిన ఏ కంటెంట్‌ను కూడా నిర్వాహకులు ప్రసారం చేయకూడదు.

ఈ నైతిక నియమావళి ప్రకారంనిబంధనల షెడ్యూల్లోని సాధారణ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వాహకులు కంటెంట్‌ను వయస్సు ఆధారంగా ఐదు వర్గాలుగా  విభజించాలి

ఈ నైతిక నియమావళి ప్రకారంపిల్లలు తమ వయసుకు తగని కంటెంట్‌ను చూడకుండా నియంత్రించేందుకు ఓటీటీ వేదికలు తగిన రక్షణ చర్యలను కూడా అమలు చేయాలి.

ఈ నిబంధనలుఇతర అంశాలతో పాటువార్తలు సమకాలీన అంశాల ఆధారిత కార్యక్రమాలను ప్రసారం చేసే వారు అనుసరించాల్సిన నైతిక ప్రమాణాలను కూడా అందిస్తాయిదీని ప్రకారం కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టం, 1995 కింద నిర్దేశించిన ప్రోగ్రామ్ కోడ్,  ప్రెస్ కౌన్సిల్ చట్టం-1978 కింద ఉన్న పాత్రికేయ సంబంధ ప్రమాణాలను కూడా పాటించడం తప్పనిసరి.

ప్రోగ్రామ్ కోడ్పాత్రికేయ సంబంధ నైతిక ప్రమాణాలు ఇతర అంశాలతో పాటుతప్పుదారి పట్టించే అసత్యమైన లేదా అర్ధసత్యమైన సమాచారాన్ని ప్రసారం చేయరాదని నిర్వాహకులను నిర్దేశిస్తున్నాయి.

నైతిక నియమావళిని  పాటించడానికి ఐటీ నిబంధనలు-2021 కింద మూడు అంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను క్రింద విధంగా ఏర్పాటు చేశారు:

లెవల్-I: ప్రచురణకర్త

బీలెవల్ II: ప్రచురణకర్తల స్వీయ నియంత్రణ సంస్థ 

సీలెవల్ –III: కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ 

నిబంధనలలో సూచించిన లెవల్-I, లెవల్-II లలోని స్వీయ నియంత్రణ నిబంధనలు వాక్ స్వాతంత్ర్యంపత్రికా భావ ప్రకటన స్వేచ్ఛ స్ఫూర్తిని పరిరక్షిస్తాయి.

అలాగేఐటీ నిబంధనలలోని రెండో భాగాన్ని ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవైనిర్వహిస్తుందియూ ట్యూబ్ఫేస్ బుక్ వంటి మాధ్యమాలు స్పష్టంగా నకిలీఅవాస్తవతప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధిస్తుంది

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ వార్తలను గుర్తించడానికి సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (ఎఫ్సీయూను నవంబర్, 2019 లో ఏర్పాటు చేశారు

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలలో ఉన్న అధికార వర్గాల నుంచి వార్త ప్రామాణికతను ధ్రువీకరించిన తరువాతఫ్యాక్ట్ చెక్ యూనిట్ తన సోషల్ మీడియా వేదికల్లో సరైన సమాచారాన్ని పోస్టు చేస్తుంది.

సమాచార సాంకేతిక చట్టం, 2000 లోని సెక్షన్ 69ఏ కిందభారతదేశ సార్వభౌమత్వం,  సమగ్రతభారతదేశ రక్షణప్రభుత్వ భద్రత,  ప్రజా ప్రయోజనాల  దృష్ట్యా వెబ్‌సైట్లుసోషల్ మీడియా పోస్టులను బ్లాక్ చేయడానికి ప్రభుత్వం అవసరమైన ఉత్తర్వులను జారీ చేస్తుంది.

సృజనకర్తల ఆర్థికవ్యవస్థ 

దేశంలో సృజనకర్తల (క్రియేటర్ ఎకానమీఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు చేపట్టారువరల్డ్ ఆడియో విజువల్,  ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025, క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్ (సీఐసీ), వేవ్స్ బజార్ వంటి కార్యక్రమాలు డిజిటల్ రంగంలో స్థానిక సాంస్కృతిక ప్రాతినిధ్యాన్ని పెంచడానికి దోహద పడ్డాయి

క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్   (సీఐసీదేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభను సమీకరించింది.  ఆవిష్కర్తలకు తమ ప్రాంతీయ నైపుణ్యాలను వృత్తిపరమైన డిజిటల్ కంటెంట్‌గా మార్చడానికి సహాయపడే విధంగా పరిశ్రమ అనుసంధానిత శిక్షణను అందించిందివేవ్స్ 2025లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు,  స్థానిక సంగీతజానపద కళల  ప్రదర్శనలు అట్టడుగు స్థాయి కళాకారులకు అంతర్జాతీయ వేదికను అందించాయిఇది వారికి గుర్తింపును,  జీవనోపాధిని మెరుగుపరచడానికి దోహదపడింది.

వేవ్స్ బజార్ ను కూడా ఒక జాతీయ మార్కెట్‌ప్లేస్‌గా ప్రారంభించారుఈ వేదిక  భారతీయ ఆవిష్కర్తలు దేశంలోని ప్రాంతీయ వైవిధ్య ప్రత్యేకతలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికిప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు,  పెట్టుబడిదారులు,  పంపిణీదారులతో నేరుగా భాగస్వామ్యం చేయడానికి దోహదపడింది

వేవ్స్ ఓటీటీ ద్వారా ప్రసార భారతి (స్థానిక కంటెంట్ సృజనకర్తలకు మద్దతునిస్తోందిఇది ప్రామాణికమైన ప్రాంతీయ అంశాలను ప్రచురించడానికిప్రోత్సహించడానికితద్వారా ఆదాయం ఆర్జించడానికి ఏకీకృత డిజిటల్ వేదికను అందించింది

రాజ్యసభలో ఈ రోజు డాక్టర్ కనిమొళి ఎన్.వి.ఎన్సోము ప్రశ్నకు సమాధానంగా సమాచారప్రసారపార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్ ఈ వివరాలు తెలిపారు

 

***


(रिलीज़ आईडी: 2203359) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam