సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం
ఇటీవల 26% పెరిగిన పత్రికా ప్రకటన రేట్లు
प्रविष्टि तिथि:
10 DEC 2025 4:27PM by PIB Hyderabad
జర్నలిస్టుల సంక్షేమానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) గుర్తింపు పొందిన జర్నలిస్టులు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) పరిధిలోకి వస్తారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఇది వర్తిస్తుంది.
దీని ద్వారా ప్రభుత్వ/ సీజీహెచ్ఎస్ జాబితాలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో సీజీహెచ్ఎస్ ధరలకే చికిత్స పొందవచ్చు.
జర్నలిస్టు సంక్షేమ పథకం (జేడబ్ల్యూఎస్)
జర్నలిస్టుల మృతి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాల్లో జర్నలిస్టులు/ మీడియా సిబ్బంది లేదా వారి కుటుంబాలకు ఏక మొత్తంగా పరిహారం ద్వారా ఉపశమనాన్ని అందించేందుకు జర్నలిస్టు సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
శాశ్వత వైకల్యంతో బాధపడుతున్న లేదా జాబితా చేసిన పెద్ద వ్యాధులతో బాధపడుతున్న జర్నలిస్టులకు కూడా దీని ద్వారా ఉపశమనం లభిస్తుంది. ప్రమాదాల కారణంగా తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరాల్సిన జర్నలిస్టులకు ఆర్థికసాయాన్ని కూడా అందిస్తుంది.
పీఐబీ, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులతోపాటు గుర్తింపు పొందని జర్నలిస్టులూ ఈ పథకం పరిధిలోకి వస్తారు.
జర్నలిస్టు సంక్షేమ పథకం కింద 2014-15 నుంచి 2024-25 వరకు 402 మంది జర్నలిస్టులు/ మీడియా సిబ్బంది లేదా వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందించింది.
‘మాన్యతా ప్రాప్త్ పత్రకార్ కల్యాణ్ సమితి ఢిల్లీ’ నుంచి అందిన అభ్యర్థనకు సంబంధించిన సమాచారం... పత్రికలు, వార, మాస పత్రికల నమోదు చట్టం- 2023, దాని 2024 నియమాల ప్రకారం దేశంలోని వార్త పత్రికలు నమోదయ్యాయి. నమోదు కోసం సులభమైన, అందుబాటులో ఉండే ఆన్‌లైన్ వ్యవస్థను ప్రెస్ సేవా పోర్టల్ అందిస్తోంది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ (సీబీసీ) నిష్పాక్షికంగా పత్రికలకు ప్రకటనలను జారీ చేస్తుంది. ఇటీవల ప్రకటనల రేట్లను 26 శాతం వరకు పెంచింది.
సీబీసీ, పీఐబీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీలకు సంబంధిత విధాన మార్గదర్శకాల ప్రకారం నామినేషన్లను చేస్తారు.
శ్రీ అరవింద్ గణపత్ సావంత్, శ్రీ సంజయ్ ఉత్తమరావు దేశ్‌ముఖ్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోకసభలో ఈ రోజు ఈ సమాచారాన్ని అందించారు.
****
(रिलीज़ आईडी: 2201950)
आगंतुक पटल : 8