సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిష్పక్షపాతమైన పోటీని, కచ్చితమైన టెలివిజన్ రేటింగ్‌ల నిర్ధారణకు టీఆర్‌పీ మార్గదర్శకాల ముసాయిదాను సవరించిన ప్రభుత్వం


వీక్షకుల విభిన్న, మారుతున్న మీడియా వినియోగ అలవాట్లను ప్రతిబింబించే నూతన వ్యవస్థ

प्रविष्टि तिथि: 10 DEC 2025 3:45PM by PIB Hyderabad

భారతదేశంలో టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీల కోసం 2014 విధాన మార్గదర్శకాల ద్వారా దేశంలో టెలివిజన్ రేటింగుల నిర్వహణ ఉంటుంది.

ఈ మార్గదర్శకాలకు సంబంధించిన సవరణ ముసాయిదాను ప్రజల అభిప్రాయ సేకరణకు 2025 జూలై 2న ప్రభుత్వం ప్రచురించింది. ఈ ప్రతిపాదిత సవరణలు సమానమైన పోటీని ప్రోత్సహించటం, కచ్చితమైన, వాస్తవ వినియోగాన్ని ప్రతిబింబించే డేటాను సేకరించటం, దేశవ్యాప్తంగా వీక్షకుల విభిన్న, మారుతున్న మీడియా వినియోగ అలవాట్లను టీఆర్‌పీ వ్యవస్థలో ఉండేలా చూడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ప్రజల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత సవరించిన ముసాయిదాను 2025 నవంబర్ 6న మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రచురించారు.

లోక్‌సభలో ఇవాళ డాక్టర్ కిర్సన్ నామ్‌దేవ్, శ్రీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఈ సమాచారాన్ని అందించారు.


(रिलीज़ आईडी: 2201695) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Tamil , Kannada