ఉప రాష్ట్రపతి సచివాలయం
యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో దీపావళి.. స్వాగతించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్
प्रविष्टि तिथि:
10 DEC 2025 12:54PM by PIB Hyderabad
అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో దీపావళిని చేర్చాలని యునెస్కో నిర్ణయించినందుకు ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రపంచ గుర్తింపునకు భారతీయులందరూ ఎంతో గర్వపడతారని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమంలో ఉపరాష్ట్రపతి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, దీపావళి ఒక పండుగ మాత్రమే కాదు, అది దేశాన్ని ఏకతాటి మీద నిలిపే సందర్భం.. యావత్తు ప్రపంచంలో సంబురాలు మారుమోగే ఒక నాగరికతా మహోత్సవం ఈ పండుగ అని స్పష్టం చేశారు. ఈ పర్వదినం భారత బహుళ సాంస్కృతికవాదాన్నీ, వైవిధ్యాన్ని, సామాజిక ఐకమత్యాన్నీ కళ్లకు కడుతుంది. దీంతో పాటు ఆశ, సద్భావన, చీకటిపై వెలుగూ, అధర్మంపై ధర్మమూ గెలిచితీరతాయనే శాశ్వత సందేశాన్ని కూడా దీపావళి అందిస్తోందని ఆయన అన్నారు.
ఈ గౌరవాన్ని భారతదేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వం, మానవాళికి అందిస్తున్న చిరస్థాయి సందేశమని శ్రీ సి.పి. రాధాకృష్ణన్ వర్ణిస్తూ, పౌరులకు హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు.
(रिलीज़ आईडी: 2201494)
आगंतुक पटल : 4