ప్రధాన మంత్రి కార్యాలయం
లోక్‌సభలో 150 సంవత్సరాల వందేమాతరం ప్రత్యేక చర్చ... ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
08 DEC 2025 4:44PM by PIB Hyderabad
వందేమాతరం 150 సంవత్సరాల ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యల నుంచి కొన్ని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘ఎక్స్’ వేదికగా విడిగా చేసిన పలు పోస్టుల ద్వారా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు;
"దేశ స్వాతంత్య్రోద్యమానికి శక్తినీ, ప్రేరణను అందించి... త్యాగం, తపస్సుల మార్గాన్ని చూపించిన మంత్రం, శక్తిమంతమైన నినాదం అయిన వందేమాతరంను స్మరించుకోవడం మనకు దక్కిన గొప్ప అదృష్టం."
"బ్రిటీషు వారి జాతీయ గీతాన్ని ప్రతీ ఇంటికి వ్యాప్తి చేయడానికి ఆంగ్లేయులు కుట్ర పన్నుతున్న సమయంలో... బంకిం బాబు దానిని సవాలు చేశారు. ఆ విధంగా వందేమాతరం ఆవిర్భవించింది."
"వేల సంవత్సరాలుగా భారత అస్తిత్వంలోనే పాతుకుపోయిన ఆలోచనను వందేమాతరం పునరుద్ధరించింది."
"1905లో బ్రిటీషు వారు బెంగాల్‌ను విభజించే పాపానికి పూనుకున్నప్పుడు, వందేమాతరం శిలలా అడ్డు నిలిచింది."
"భరత భూమికి చెందిన ధైర్యవంతులైన పుత్రులెందరో వందేమాతరం ఆలపిస్తూ ఉరిశిక్షను స్వీకరించారు. చివరి వరకు వందేమాతరం వారి పల్లవిగానే నిలిచింది."
"వందేమాతరం భారత స్వయం-సమృద్ధికి మార్గాన్ని చూపింది. విదేశీ కంపెనీలను సవాలు చేయడానికి ఇది ఒక మంత్రంగా మారింది. తద్వారా స్వాతంత్య్ర మంత్రాన్ని స్వదేశీ మంత్రంగా విస్తరించింది."
"ఇంత గొప్ప వందేమాతరం గత శతాబ్దంలో ఎందుకు అన్యాయానికి, ద్రోహానికి గురైందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం..."
"బుజ్జగింపు రాజకీయాల ఒత్తిడిలో కాంగ్రెస్ వందేమాతరం విభజనకు తలొగ్గింది... అందుకే ఒకరోజు కాంగ్రెస్ భారత విభజనకూ తలొగ్గాల్సి వచ్చింది."
***
(रिलीज़ आईडी: 2200662)
आगंतुक पटल : 4