ప్రధాన మంత్రి కార్యాలయం
భారతీయ సంప్రదాయాలు, విలువలను ప్రోత్సహించేలా దూరదర్శన్‌లో ప్రసారం చేస్తున్న ‘సుప్రభాతం’ కార్యక్రమానికి ప్రధానమంత్రి ప్రశంసలు
प्रविष्टि तिथि:
08 DEC 2025 9:03AM by PIB Hyderabad
దూరదర్శన్‌లో ప్రసారం చేస్తున్న ‘సుప్రభాతం’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది ఉదయం పూటను ఒక నూతనమైన ఉత్సాహంతో మొదలుపెట్టేందుకు తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం యోగా మొదలు భారతీయ జీవన శైలి లోని విభిన్న కోణాలనూ, వివిధ విషయాలనూ వివరిస్తోందని ఆయన అన్నారు.
భారతీయ సంప్రదాయాలను గురించీ, విలువలను గురించీ చాటి చెబుతున్న ఈ కార్యక్రమం జ్ఞానం, స్ఫూర్తి, సానుకూల ఆలోచన విధానాల విశిష్ట కలయికను కళ్లకు కడుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సుప్రభాతం కార్యక్రమంలో విశేష విభాగంగా అందిస్తున్న ‘సంస్కృత సుభాషితం’ గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ విభాగం భారతదేశ సంస్కృతి, వారసత్వాలపై ఒక కొత్త అవగాహనను వ్యాపింప చేయడానికి దోహదం చేస్తోందని ఆయన అన్నారు.
ఈ రోజు సుభాషితాన్ని వీక్షకులతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వేర్వేరు సందేశాల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“दूरदर्शन पर प्रसारित होने वाला सुप्रभातम् कार्यक्रम सुबह-सुबह ताजगी भरा एहसास देता है। इसमें योग से लेकर भारतीय जीवन शैली तक अलग-अलग पहलुओं पर चर्चा होती है। भारतीय परंपराओं और मूल्यों पर आधारित यह कार्यक्रम ज्ञान, प्रेरणा और सकारात्मकता का अद्भुत संगम है।
https://www.youtube.com/watch?v=vNPCnjgSBqU”
“सुप्रभातम् कार्यक्रम में एक विशेष हिस्से की ओर आपका ध्यान आकर्षित करना चाहूंगा। यह है संस्कृत सुभाषित। इसके माध्यम से भारतीय संस्कृति और विरासत को लेकर एक नई चेतना का संचार होता है। यह है आज का सुभाषित…”
(रिलीज़ आईडी: 2200271)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam