కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సంచార్ సాథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేసుకోవాలన్న నిబంధనను ఉపసంహరించుకున్న ప్రభుత్వం
प्रविष्टि तिथि:
03 DEC 2025 3:00PM by PIB Hyderabad
పౌరులందరికీ సైబర్ భద్రతను కల్పించాలన్న ఉద్దేశంతో అన్ని స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ యాప్ సురక్షితమైనది. సైబర్ నేరగాళ్లు, మోసపూరిత చర్యల నుంచి పౌరులను రక్షించేందుకు రూపొందించింది.
వినియోగదారులకు రక్షణ కల్పిస్తూ, నేరగాళ్లు, మోసపూరిత చర్యల గురించి ఫిర్యాదు చేయటంలో ప్రజల భాగస్వామ్యానికి ఇది సహకరిస్తుంది. వినియోగదారులను కాపాడటమే ఈ యాప్ పని. వినియోగదారులు ఎప్పుడైనా యాప్‌ని ఫోన్ నుంచి తొలగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటివరకు 1.4 కోట్ల మంది వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. రోజుకు 2,000 నేర సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇతరులకు కూడా యాప్ ని సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలన్న ఆదేశాలు ఇచ్చారు. కేవలం నిన్న ఒక్కరోజులోనే 6 లక్షల మంది పౌరులు యాప్ ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు నమోదు చేసుకున్నారు. ఇది సాధారణం కంటే 10 రెట్లు అధికం. తన భద్రతకు ప్రభుత్వం అందించిన ఈ యాప్ పై పౌరులకున్న విశ్వాసాన్ని ఇది స్పష్టం చేస్తుంది.
సంచార్ సాథీకి ఆదరణ పెరుగుతున్నందున, మొబైల్ తయారీదారులు ముందుగానే ఆ యాప్ ని ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయాలన్న నిబంధనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరింత సమాచారం కోసం డీఓటీ హ్యాండిల్స్‌ను అనుసరించండి:
ఎక్స్ - https://x.com/DoT_India
ఇన్‌స్టా - -https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==
ఎఫ్‌బీ - https://www.facebook.com/DoTIndia
యూట్యూబ్: https://www.youtube.com/@departmentoftelecom
(रिलीज़ आईडी: 2198503)
आगंतुक पटल : 16