కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంచార్ సాథీ యాప్ తప్పనిసరన్న అంశంపై అపోహలను తొలగించిన కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా


వినియోగదారులు ఎప్పుడైనా యాప్ ను తొలగించవచ్చు..

స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నప్పుడే యాప్ పని చేస్తుంది: శ్రీ సింధియా

సంచార్ సాథీ... నిఘా వ్యవస్థ కాదు.. ప్రజల భాగస్వామ్యంతో కూడిన రక్షణ సాధనం: శ్రీ సింధియా

प्रविष्टि तिथि: 02 DEC 2025 2:54PM by PIB Hyderabad

సంచార్ సాథీ యాప్ వాడకం తప్పనిసరి అన్న దానిపై కేంద్ర కమ్యూనికేషన్లుఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ స్పష్టతనిచ్చారుసంచార్ సాథీ యాప్ పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధమైనదనిస్వచ్ఛందమైనదని తెలిపారుఈ యాప్ ప్రయోజనాలను పొందటానికి వినియోగదారులకు వీలునప్పుడు యాక్టివేట్ చేసుకోవచ్చనితమ సాధనాల నుంచి ఎప్పుడైనా దాన్ని డీ-యాక్టివేట్ గానీ లేదా తొలగించవచ్చన్నారు.

పౌరులకు ప్రాధాన్యతగోప్యతకు సురక్షితమైన వేదిక

వినియోగదారుల భద్రత ప్రభుత్వ ప్రధాన బాధ్యత అనిమొబైల్ వినియోగదారుడి సాధికారతకు సంచార్ సాథీ యాప్ ని రూపొందించినట్లు శ్రీ సింధియా తెలిపారు. "సంచార్ సాథీ యాప్పోర్టల్ రెండూ.. పారదర్శకమైనసులభంగా ఉపయోగించగలిగే సాధనాల ద్వారా తమను తాము రక్షించుకునేందుకు వీలు కల్పిస్తాయిప్రజల భాగస్వామ్యం దిశగా ఇది కీలక ముందడుగుడిజిటల్ వ్యవస్థ రక్షణలో భాగంగా పౌరులు క్రియాశీలకంగా ఇందులో పాల్గొంటారుఅని చెప్పారు.

ప్రభావంసంచార్ సాథీ సాధించిన గణాంకాలు

సంచార్ సాథీ ప్రారంభమైనప్పటి నుంచి వచ్చిన మెరుగైన ఫలితాలు:

  • 21.5 కోట్ల మందికి పైగా పోర్టల్ ను సందర్శించారు.

  • 1.4 కోట్ల మందికి పైగా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు.

  • 'నా నంబర్ కాదుఅని ఎంచుకుని 1.43 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లను పౌరులు డిస్ కనెక్ట్ చేశారు.

  • పోగొట్టుకున్నదొంగిలించిన 26 లక్షల ఫోన్లను గుర్తించి, 7.23 లక్షల ఫోన్లను తిరిగి సంబంధిత వ్యక్తులకు చేరవేశారు.

  • పౌర ఫిర్యాదుల ఆధారంగా 40.96 లక్షల మోసపూరిత కనెక్షన్లను తొలగించారు.

  • మోసపూరిత కార్యకలాపాలతో ముడిపడిన 6.2 లక్షల ఐఎంఈఐ నంబర్లను నిలిపివేశారు.

  • రూ.475 కోట్ల ఆర్థిక నష్టం జరగకుండా ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐద్వారా నివారించారు.

సైబర్ భద్రతపౌరల రక్షణ ప్రధాన అంశం

వినియోగదారుల కాల్ లాగ్స్ నుంచే నేరుగా మోసపూరిత కాల్స్ పై ఫిర్యాదు చేయటానికి సంచార్ సాథీ అవకాశం కల్పిస్తోందిఅలాగేఅవగాహన ఉన్న వాళ్లు… ఇతరులను కూడా రక్షించగలుగుతారు.

"ప్రతి పౌరుడికి డిజిటల్ భద్రత కల్పించటం మా ప్రధాన ప్రాధాన్యతసంచార్ సాథీ అనేది స్వచ్ఛందంగా వినియోగించగలిగేదిపారదర్శకమైనదిదేశంలోని మొబైల్ వినియోగదారులను రక్షించటానికిదేశ సైబర్ భద్రతను మెరుగుపరచటానికి రూపొందించారువినియోగదారులు ఈ యాప్ ను ఎప్పుడైనా యాక్టివేట్ చేయటానికి లేదా తొలగించడానికి స్వేచ్ఛ ఉంటుందిగోప్యతకు భంగం కలిగించకుండా భద్రతను కల్పిస్తుందిఅని సింధియా తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2197626) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Kannada