హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అసోం దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా అసోం దివస్ సందర్భంగా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు హృదయపూర్వక శుభాకాంక్షలు

అహోం యుగ వైభవ సంబరాలు… అస్సాం సుసంపన్న సంస్కృతిని పరిరక్షించేందుకు ప్రాధాన్యత..

ఇది ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణం

గత 9 ఏళ్లలో అస్సాంలో శాంతిని నెలకొల్పి అభివృద్ధి, విద్యకు కేంద్రంగా మార్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం..

ఈ పురోగతిని కొనసాగించాలని సంకల్పించిన ప్రభుత్వం... ఐక్యతా బంధం, సాంస్కృతిక అనుబంధం నేడు మరింత పటిష్టం

నాడు పోస్టు చేయడమైనది: 02 DEC 2025 12:28PM by PIB Hyderabad

అసోం దివస్ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అస్సాం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

"అసోం దివస్ సందర్భంగా అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భం అహోం యుగ వైభవాన్ని పండగ చేసుకునే సందర్భం. గుర్తు చేస్తుంది. ప్రతి భారతీయుడు గర్వించదగిన అస్సాం రాష్ట్ర సుసంపన్నమైన సంస్కృతిని పరిరక్షించాలనే ప్రాధాన్యతను బలపరుస్తుంది" అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

"గత 9 ఏళ్లుగా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, అస్సాంలో శాంతిని నెలకొల్పి అభివృద్ధి, విద్యకు కేంద్రంగా మార్చింది. ఈ పురోగతిని కొనసాగించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రత్యేక రోజున మన ఐక్యతా బంధం, సాంస్కృతిక అనుబంధం మరింత పటిష్టం కావాలి" అని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆకాంక్షించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2197498) సందర్శకుల సూచీ సంఖ్య : : 64
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil