ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్పష్టమైన విధానాలు, నిరంతర కార్యాచరణతో పాటు క్షేత్ర స్థాయి కార్యక్రమాలతో బాల్య వివాహాలకు స్వస్తి పలకడానికి భారత్ చేస్తున్న కృషిని చాటిచెప్పిన వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 NOV 2025 2:54PM by PIB Hyderabad
బాల్య వివాహాలకు స్వస్తి పలికే దిశగా భారత్  స్పష్టమైన విధానాల అమలు, నిరంతర కార్యాచరణతో పాటు క్షేత్రస్థాయిలో చేపడుతున్న  కార్యక్రమాల్ని ప్రధానంగా చాటిచెప్పిన ఓ వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
 సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి పోస్టుకు  ప్రధానమంత్రి స్పందిస్తూ -
‘‘కొన్నేళ్ల కిందటి వరకూ బాల్య వివాహాలకు ముగింపు పలకడం కష్టసాధ్యమే కాక అసాధ్యం కూడా అని అనిపించిందని కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి రాశారు. అయితే, భారత్ తన కృషితో బాల్య వివాహాలను రూపుమాపవచ్చని నిరూపించింది. స్పష్టమైన విధానాలు, నిరంతర కార్యాచరణకు తోడు క్షేత్ర స్థాయి కార్యక్రమాలతో.. తలచుకుంటే ఎలాంటి మార్పు అయినా సంభవమేనని మేం రుజువు చేశాం’’ అని పేర్కొన్నారు.
 
***

(रिलीज़ आईडी: 2196719) आगंतुक पटल : 37
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam