థాయిలాండ్ అద్భుత చిత్రం జెమ్ 'ఎ యూస్‌ఫుల్ ఘోస్ట్' తో ఘనంగా ముగిసిన ఇఫీ అంతర్జాతీయ విభాగం ప్రేమ వాక్యూమ్ క్లీనర్‌గా ఓ వినోదాత్మక కథ
'
సినిమాలోని వినోదం, భావోద్వేగ అంశాల గురించి వివరించిన దర్శకుడు రచ్చపూమ్,చిత్ర బృందం
ఇఫిలో అంతర్జాతీయ విభాగం ముగిపు వేడుకను ఇంతకన్నా గొప్పగా ఎవరూ ఊహించలేరేమో. అందుకు కారణం థాయ్‌లాండ్ నుంచి ఆస్కార్‌కు అధికారికంగా అర్హత సాధించిన, కేన్స్ లో గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచిన 'ఏ యూస్‌ఫుల్ ఘోస్ట్' చిత్ర బృందం నేడు మీడియాతో సమావేశమవడమే. వారి సినిమాలోని వినోదం, సున్నితత్వం సామాజిక స్పృహ, హాస్యాన్ని కలిగిన అరుదైన మిశ్రమాన్ని విలేకరులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు రచ్చపూమ్ బూన్‌బుంచాచోక్, సహాయక నిర్మాత తానాడే అమోర్న్ పియాలర్క్, నటుడు విశసరుత్ హోమ్‌హువాన్, సినిమాటోగ్రాఫర్ సాంగ్ ససిట్ వేదికపై .. దుఃఖంలో ఉన్న ఒక భర్త తన చనిపోయిన భార్య ఓ వాక్యూమ్ క్లీనర్ రూపంలో పునర్జన్మ పొందినట్లు చూపించే అద్భుతమైన, సున్నితమైన కథా ప్రపంచాన్ని వివరించారు.
‘‘ఒక పిచ్చి ఆలోచన ఇంత దూరం వెళ్లగలదని ఎవరు ఊహించగలరు?’’ — రచ్చపూమ్
సినిమా ప్రయాణాన్ని వివరిస్తూ.. దర్శకుడు రచ్చపూమ్ తన ఆశ్చర్యం, ఆనందాన్ని పంచుకున్నారు.
‘‘ఇంత వెర్రి ఆలోచనతో కూడిన ఈ సినిమా ఇంత దూరం ప్రయాణించి, ఇంత మంది ప్రజలను చేరుకోగలదని ఎవరు ఊహించి ఉంటారు?’’ అని ఆయన అన్నారు. అయితే కథ మొదట్లో దెయ్యాన్ని సాధారణమైన మానవ రూపంలో కనిపించేలా రూపొందించాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ ఆ ఆలోచన చాలా సాధారణంగా ఉందని, అద్భుతాన్ని అందించేలదని అనిపించిందన్నారు. అప్పుడే దెయ్యం ఒక వాక్యూమ్ క్లీనర్ రూపంలో పునర్జన్మ పొందినట్లు కొత్తగా మార్చానని చెప్పారు.
‘‘థాయిలాండ్‌లో వాయు కాలుష్యం తీవ్రమైన సమస్య. ఈ చిత్రంలో అదే హీరోయిన్ ప్రాణాలు తీస్తుంది. కాబట్టి వాక్యూమ్ క్లీనర్ ఆమె మరణానికి కారణమైన అంశానికి ఓ కవితాత్మక ప్రతిస్పందనగా మారుతుంది’’ అని దర్శకుడు రచ్చపూమ్ సినిమా కథ ఎంపిక గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా దెయ్యాల చిత్రీకరణలను అధ్యయనం చేసేందుకు అధిక సమయాన్ని కేటాయించినట్లు తెలిపారు. భారీ మేకప్‌ను ఉపయోగించే భూతాల నుంచి సుక్ష్మమైన, కనిపించని అస్తిత్వాల వరకు చూసి.. చివరకు కొంత వింతైన, సున్నితమైన, వ్యక్తిగతమైన రూపం వైపు మొగ్గు చూపినట్లు చెప్పారు.
‘‘సినిమాటిక్ గా లేదని భయపడవద్దు’’ : సినిమాటోగ్రాఫర్ సాంగ్ పసిట్
ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని గంభీరత, హాస్యం మధ్య ఊగిసలాడేలా, రెండింటినీ సమతుల్యంగా చూపించామని సినిమాటోగ్రాఫర్ సాంగ్ పాసిట్ వివరించారు. ‘సినిమాటిక్ గా ఉండదని భయపడవద్దు’ అనేది తమ ఆలోచన అని చెప్పారు.
సినిమా రూపకల్పనలో పనిచేసిన బృందం విచిత్ర కోణాలను, ఉల్లాసభరితమైన కూర్పులను, మెరుస్తున్న ధైర్యమైన రంగులను ఉపయోగించేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. ముఖ్యంగా ఎరుపు రంగుకు ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని దర్శకుడు పట్టుబట్టాడని వెల్లడించారు. ప్రేక్షకులను ఒకేసారి హాస్యాస్పదంగా, రహస్యంగా, కొద్దిగా విభిన్న ప్రపంచంలో ముంచెత్తడమే దీని లక్ష్యమని తెలిపారు.
థాయ్‌లాండ్ సినీ రంగం గురించి..
థాయ్ సినిమా తెర వెనుక ప్రపంచం గురించి సహాయ నిర్మాత తనడే అమొర్న్‌పియాలెర్క్ వివరించారు. సినీ నిర్మాతలు కొత్తగా ఆలోచిస్తున్నప్పటికీ.. థాయ్ సినీ పరిశ్రమ థియేటర్లలో సంవత్సరానికి కేవలం 30 సినిమాలను మాత్రమే విడుదల చేస్తోందని అన్నారు. అయితే హాలీవుడ్ టైటిల్స్ ఆధిపత్యం చలాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
కళా వైవిధ్యం పరిమితంగానే ఉందని, చలనచిత్రాలు స్వచ్ఛమైన వినోదం అయినప్పటికీ, సినిమా ఏదో ఒక విషయాన్ని చెప్పాలని వ్యక్తిగతంగా నమ్ముతానని రచ్చపూమ్ తెలిపారు.
"ఈ పాత్ర నా జీవితాన్ని మార్చింది" — నటుడు విసారుట్ హోమ్‌హువాన్
నటుడు విసారుట్ హోమ్‌హువాన్‌కు ’ఎ యూజ్‌ఫుల్ ఘోస్ట్‘ చిత్రం సవాలుతో కూడుకొని, కెరీర్‌ను మలుపుతిప్పే సినిమాగా మారింది. ‘‘థాయ్‌లాండ్‌లో నటుడిగా ఉండటం కష్టం. నేను టీవీ, టిక్‌టాక్ వంటి ప్రతిచోటా పనిచేశాను. అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ చిత్రం నాకు ఒక పెద్ద మార్గాన్ని చూపించింది. చివరికి నన్ను సినీ నటుడిగా ప్రజలు గుర్తించడానికి అనుమతించింది’’ అని చెప్పారు.
పత్రికా సమావేశం ముగిసే సమయానికి.. ఈ చిత్రం ప్రపంచ దృష్టిని ఎందుకు ఆకర్షించిందో స్పష్టమైంది. ఇది ఒకేసారి వింతగా, నిజాయితీగా, సామాజికంగా ప్రతిధ్వనించే ధైర్యం చేస్తుంది. అలా చేయడం ద్వారా ఇది ఇఫికి అంతర్జాతీయ విభాగానికి సంతోషకరమైన, మర్చిపోలేని ముగింపును అందించింది.
'ఏ యూజ్‌ఫుల్ ఘోస్ట్' చితాన్ని మొత్తం బృందం పరస్పర వైరుధ్యాలతో వర్ణించే కథగా అభివర్ణించింది. హాస్, వెంటాడేదిగా, అద్భుతమైనదిగా ఉంటుందన్నారు. నిజమైన పర్యావరణ సమస్యలలో పాతుకుపోయి, తన విచిత్రమైన స్ఫూర్తిని కోల్పోకుండానే హృదయాన్ని తాకేలా ఉంటుందని చెప్పారు.
ఐఎఫ్‌ఎఫ్‌ఐ గురించి..
1952లో ఆవిర్భవించిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాకు చెందిన జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్‌సీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం.. పునర్నిర్మిత క్లాసిక్‌ల నుంచి సాహసోపేతమైన ప్రయోగాల వరకు, దిగ్గజ చిత్ర ప్రముఖుల నుంచి తొలి అడుగు వేస్తున్న కొత్త ప్రతిభావంతుల వరకు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రపంచ స్థాయి సినీ వేదికగా ఎదిగింది. వైవిధ్యభరితమైన మేళవింపు, అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు, ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలు, రెక్కలు తొడిగిన ఉత్సాహవంతమైన ఫిల్మ్ బజార్ లతో ఐఎఫ్ఎఫ్ఐ మెరిసింది. గోవాలోని అందమైన తీరప్రాంతంలో నవంబర్ 20 నుంచి 28 తేదీ వరకు జరుగుతున్న 56వ సంచిక.. భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సమాహారాన్ని ప్రదర్శిస్తూ, ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభకు అద్భుతమైన వేడుకగా నిలుస్తుంది.
మరిన్ని వివరాల కోసం, క్లిక్ చేయండి:
ఐఎఫ్‌ఎఫ్‌ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ చానల్:
https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ ఖాతాలు: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
रिलीज़ आईडी:
2196709
| Visitor Counter:
4