ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2025-26 రెండో త్రైమాసికంలో భారత 8.2 శాతం బలమైన జీడీపీ వృద్ధిని స్వాగతించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 NOV 2025 6:24PM by PIB Hyderabad

2025-26 రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత రీతిలో 8.2 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఈ రోజు వెల్లడైన తాజా జీడీపీ గణాంకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారుఈ విజయం ప్రభుత్వ వృద్ధి అనుకూల విధానాలుసంస్కరణల ప్రభావాన్ని... భారత ప్రజల కృషివ్యాపార ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారుసంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికిప్రతి పౌరుడి కోసం జీవన సౌలభ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వృద్ధి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చూసుకుంటున్నామని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"2025-26 రెండో త్రైమాసికంలో 8.2 శాతం జీడీపీ వృద్ధి చాలా ప్రోత్సాహకరంగా ఉందిఇది మా వృద్ధి అనుకూల విధానాలుసంస్కరణల ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందిఇది మా ప్రజల కృషివ్యాపార ప్రభావాన్నీ ప్రతిబింబిస్తుందిమా ప్రభుత్వం సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంప్రతి పౌరుడి కోసం జీవన సౌలభ్యాన్ని బలోపేతం చేయడం కొనసాగిస్తుంది."


 

***


(रिलीज़ आईडी: 2196708) आगंतुक पटल : 37
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Tamil , Bengali , Bengali-TR , Odia , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Kannada