హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ భీంరావు అంబేడ్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌లతో పాటు


రాజ్యాంగ పరిషత్తులోని మహనీయ సభ్యులందరికీ నమస్సులు అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా..

దేశ పౌరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి


ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలోని రాజ్యాంగం

పౌరులందరికీ సమాన అవకాశాల్నీ, ఆత్మగౌరవంతో కూడిన జీవనాన్నీ, జాతీయ కర్తవ్యాల్నీ, హక్కుల్నీ అందించి
బలమైన దేశాన్ని నిర్మించేందుకు బాట వేసింది

‘రాజ్యాంగ దినోత్సవాని’కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు..

ప్రజాస్వామిక విలువల పట్ల దేశ పౌరులు మరింత ఎక్కువ అవగాహనతోనూ, చైతన్యంతోనూ ఉండేటట్లు చేశారు

Posted On: 26 NOV 2025 2:19PM by PIB Hyderabad

‘రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ భీంరావు అంబేడ్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌లతో పాటు రాజ్యాంగ పరిషత్తులోని మహనీయ సభ్యులందరికీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నమస్సులర్పించారు. దేశ పౌరులకు కేంద్ర మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలోని రాజ్యాంగం పౌరులందరికీ సమాన అవకాశాల్నీ, ఆత్మగౌరవంతో కూడిన జీవనాన్నీ, జాతీయ కర్తవ్యాల్నీ, హక్కుల్నీ అందిస్తూ ఒక బలమైన దేశాన్ని నిర్మించడానికి బాటను వేసిందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘రాజ్యాంగ దినోత్సవాని’కి శుభారంభం చేసి, ప్రజాస్వామిక విలువలపై దేశ పౌరుల్లో మరింత అవగాహన కలిగేటట్లు చేశారని శ్రీ షా అన్నారు.   


(Release ID: 2195070) Visitor Counter : 3